Begin typing your search above and press return to search.
ఆ జిల్లాలో టీడీపీ జెండాలు పూర్తిగా పీకేస్తున్న నేతలు..
By: Tupaki Desk | 14 Aug 2019 1:26 PM GMTఏపీలోనే టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వస్తోంది. ఇక రెండు దశాబ్దాలుగా అధికారంలో లేని తెలంగాణలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తెలంగాణలో కనుమరగయ్యే స్థితిలో ఉన్న టీడీపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకి రెండు జిల్లాలో టీడీపీ జెండా ఎత్తేసే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే చాలామంది నేతలు టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లలో చేరిపోగా - ఇప్పుడు చెదురుమదురుగా మిగిలిన నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 18న హైదరాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ తీర్ధం పుచ్చుకొనున్నారు.
ముఖ్యంగా నల్గొండ జిల్లాలో టీడీపీ తరుపున బలంగా వాయిస్ వినిపించే ఆ పార్టీ రాష్ట్ర నేత పాల్వాయి రజనీకుమారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమెతో పాటు కొందరు ముఖ్యనేతలు కూడా పార్టీని వీడనున్నారు. ఇక తామంతా 18న బీజేపీ చేరబోతున్నామని రాజీనామా సందర్భంగా రజనీకుమారి చెప్పుకొచ్చారు. పార్టీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇప్పటకీ బలమైన వాయిస్ వినిపస్తూ వస్తోన్న ఆమె పార్టీ మారడం టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బే.
ఇక నల్గొండ కంటే కొత్తగూడెం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో 30 సంవత్సరాలుగా ఉంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల అమిత్ షాతో భేటీ అయిన ఆయన బీజేపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా టీడీపీకి రాజీనామా చేసి 18న నడ్డా నేతృత్వంలో బీజేపీలో చేరనున్నారు. కాగా, కోనేరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటు ఆశించారు... కానీ కాంగ్రెస్ పొత్తులో అది కుదరలేదు.
దీంతో ఆయనకి టీఆర్ ఎస్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలోకి వస్తే సీటు ఇస్తామని చెప్పారు. అయిన కోనేరు పార్టీ మారలేదు. కానీ తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేకపోవడంతో..తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరుతున్నారు. ఇక కోనేరుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు - జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయికి వరకు నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. మొత్తం మీద కొత్తగూడెం జిల్లాలో టోటల్ గా టీడీపీ జెండా పీకేయనుంది. ఇక మెదక్, కామారెడ్డి, పాత ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.