Begin typing your search above and press return to search.
తెదేపా ఈ మాట అక్కడ చెప్పగలదా?
By: Tupaki Desk | 23 Sep 2015 3:51 AM GMTతెలంగాణలో రైతులు చాలా పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న మాట వాస్తవం. అయితే పాలకపక్షాన్ని ఇరుకున పెట్టడం ఒక్కటే లక్ష్యం అన్నట్లుగా ఇక్కడి తెలుగుదేశం పార్టీ.. కొన్ని డిమాండ్లను వారికి వినిపిస్తున్నది. ప్రతిపక్షాలంతా.. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వమంటే.. కేసీఆర్ సర్కారు 6 లక్షలు ప్రకటించింది. అయితే.. ఈ ఎక్స్ గ్రేషియా ఆత్మహత్యల సంఖ్యను మరింత పెంచేలా, రైతుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నదంటూ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నది.
పాలకపక్షాన్ని అసెంబ్లీలో పూర్తిస్థాయిలో నిలదీయడానికి సిద్ధం అవుతున్న తెలంగాణ తెలుగుదేశం ఎక్స్ గ్రేషియా అనే తమ డిమాండుకు కాలం చెల్లిన తర్వాత.. చనిపోయిన తర్వాత డబ్బు ఇవ్వడం కాదు.. చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదంటూ కొత్త పాట అందుకున్నారు.
రైతులకు వ్యక్తిగత - పంట బీమా కల్పించడం - ప్రెవేటు అప్పులపై మారటోరియం - మద్దతు ధర - బ్యాంకురుణాల్ని ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించేయడం వంటి డిమాండ్లను వారు వినిపిస్తున్నారు. అయితే వీటిలో ఏ డిమాండ్ ల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రుణమాఫీని ఏకమొత్తంగా ఒకేసారి బ్యాంకులకు చెల్లించేయడం అనేది ఏ ప్రభుత్వానికి అయినా ఆచరణ సాధ్యం కాని సంగతి. విడతలుగా చెల్లిస్తాం అని మాట ఇచ్చిన ప్రభుత్వాలు కొంత మేర ఇప్పటికే చెల్లించాయి. ఇప్పుడు రైతులు మరణిస్తున్నారు గనుక.. తక్షణం ఒకేసారి మొత్తం రుణాల్ని చెల్లించేయాలంటూ.. తెదేపా డిమాండ్ చేస్తోంది.
అయితే తెతెదేపా ఇదే డిమాండును పొరుగున వారి పార్టీ ఏలుబడిలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వినిపించగలదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పరంగా గానీ, రైతుల ఆత్మహత్యల పరంగా గానీ.. చంద్రబాబునాయుడు కూడా సేం టు సేం కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి నేపథ్యంలో.. ఒకేసారి కట్టేయమని టీసర్కారుకు హితవు చెబుతున్న తెతెదేపా.. ఇదే మాటలను ఏపీలో తమ నేత చంద్రబాబుకు కూడా చెప్పి.. ఆయనను ఆదర్శంగా నిలపగలదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.