Begin typing your search above and press return to search.
షాక్: ఏపీ రాజధానిలో టీడీపీ ధర్నా
By: Tupaki Desk | 27 Oct 2016 9:47 AM GMTఅవును! ఏపీ రాజధాని అమరావతిలో అధికార టీడీపీ నేతలే విపక్షం పాత్ర పోషిస్తున్నారు! ఒక పక్ష ఏకైక విపక్షం వైకాపాతోనే తలనొప్పులు తట్టుకోలేక పోతున్న చంద్రబాబుకు ఇప్పుడు స్వపక్షంలోనూ విపక్షం సెగ తగులుతోంది. సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వంపై విపక్ష నేతలు ఫైరవుతురు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. కానీ ఏపీలో ఇప్పుడు అధికార పార్టీ నేతలే అధికార పక్షంపై విరుచుకు పడుతున్నారు. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కసారిగా తలలు పట్టుకుంటున్నారని తెలిసింది. విషయంలో కి వెళ్లిపోదాం..
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రోడ్డును(పెనుమాక మీదుగా అమరావతికి వెళ్లే రహదారి) విస్తరించాలని అధికారులు భావించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న రోడ్డును తొవ్వారు. అయితే, కొత్త రోడ్డు వేయడంలో జాప్యం జరిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక టీడీపీ తమ్ముళ్లు.. రోడ్డును తక్షణమే నిర్మించాలని పట్టుబట్టారు. అధికారుల వైఖరికి నిరసనగా ఏకంగా గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిపోయారు.
విస్తరణ కోసం రోడ్డును తవ్వి రోజులు గడుస్తున్నా, పనులు మొదలు పెట్టడం లేదని వీరు విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోడ్డుపైనే కూర్చునిపోయి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పెనమాక గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అంతా పాల్గొంది. వీరి నిరసనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలావుంటే,ఈ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు ఒకింత ఆశ్చర్యానికి, ఆందోళనకి కూడా గురయ్యారంట.! మరి వీరిమీద అధిష్టానం ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/