Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు రోడ్డును తవ్వేశారు
By: Tupaki Desk | 30 Nov 2016 11:59 AM GMT వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు నానా బాధలు పడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఫిరాయింపు నేతల కష్టాలు అన్నీఇన్నీ కావు. టీడీపీ స్థానిక నేతలు, చోటా మోటా నేతలు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తాజాగా కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములుకు ఘోరమైన పరిస్థితి ఎదురైంది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ చేపడుతున్న జనచైతన్య యాత్రలను భారీ రేంజిలో నిర్వహించాలన్న కోరికతో బైకు ర్యాలీకి ప్లాన్ చేశారు. కానీ మిగతా టీడీపీ నేతలు ఆ ర్యాలీని ఎలాగైనా అడ్డుకోవాలని అంతకుమించిన ప్లాను వేశారు. అందుకోసం ఏకంగా ర్యాలీ సాగాల్సిన మార్గంలో రోడ్లను తవ్వేసి జయరాములు జోరుకు బ్రేకులేశారు.
జనచైతన్య యాత్రల్లో భాగంగా ఎమ్మెల్యే జయరాములు బద్వేల్ లో పర్యటించాల్సి ఉంది. బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అక్కడి టీడీపీ నాయకురాలు విజయమ్మ, మున్సిపల్ చైర్మన్ పార్థసారథిలకు అది ఇష్టం లేదు. దీంతో వారు బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు రోడ్డును తవ్వేశారు. అడ్డంగా పొక్లయినర్లు పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే జయరాములు ఏమీ చేయలేక బిక్కమొహం వేశారు.
కర్నూలులోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. భూమా నాగిరెడ్డి వంటి ఉద్దండులకే టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. అనంతపురంలో ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషానైతే కొంతకాలం ఆయన నియోజకవర్గంలోకి కూడా రానివ్వకుండా అడ్డు తగిలారు. పాపం... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రకటించిన తాయిలాలేవీ దక్కకపోగా ప్రతి రోజూ కష్టాలే ఎదురవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/