Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న మహా ఫ్రీ వ్యవహారం

By:  Tupaki Desk   |   28 Feb 2019 11:23 AM GMT
వైరల్ అవుతున్న మహా ఫ్రీ వ్యవహారం
X
ఎన్టీఆర్ మహానాయకుడిని బాక్స్ ఆఫీస్ దగ్గర సజీవంగా నిలబెట్టేందుకు టిడిపి శ్రేణులు పడుతున్న తిప్పలన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ సినిమా చూసే ప్రసక్తే లేదని ప్రేక్షకులు తేల్చి చెప్పడంతో థియేటర్ల ఫీడింగ్ కోసం తెలుగుదేశం ఎంఎల్ఏలు నాయకులు రంగంలోకి దిగి గంపగుత్తగా టికెట్లు కొని మరీ పంచుతున్నారన్న దాని మీద గత రెండు రోజులుగా విపరీతమైన కథనాలు సాక్ష్యాదారాలతో సహా బట్టబయలైపోయాయి.

అయితే ఈ వ్యవహారం ఏదో ఒకటో రెండు రోజులకో పరిమితం అనుకున్నారు కానీ స్కెచ్ మాత్రం మొత్తం కలిపి నెల దాకా ఉండేలా కనిపిస్తోంది. తాజాగా గుంటూరులోని పలు థియేటర్లలో ఇచ్చినవిగా చూపబడుతున్న ఫ్రీ టికెట్లు మరోసారి ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి. పిలిచి మరీ వీటిని ఇస్తున్నారని ఎవరైనా అంతగా సుముఖంగా లేకపోతే ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ కూడా ఆఫర్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయని వాటితో పాటు వస్తున్న కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

మహానాయకుడు సేఫ్ అయ్యే ఛాన్స్ లేకపోయినా ఇలా ఏదో రకంగా నెల రోజులు నడిపితే బ్యాడ్ రన్ అనే ముద్ర తొలగడంతో పాటు ఎగ్జిబిటర్లకు నెగటివ్ షేర్ రాలేదనే మాటను చెప్పించుకోవచ్చు. అయితే ఈ తిప్పలన్నీ పడుతున్నది బాలయ్య ఫ్యాన్స్ కాదని అధినేత ఆదేశాల మేరకు టిడిపి అనుచరగణమే ఈ బాధ్యత తీసుకుని ఎన్టీఆర్ కష్టకాలంలో తమ నాయకుడు చేసిన పనులను చూడమని అందరిని ప్రేరేపిస్తున్నారట. ఇవి నిజమో కాదో కానీ ఈ ప్రచారం మాత్రం మహానాయకుడుడి డ్యామేజ్ చేసేదే తప్ప ప్లస్ ఎంత మాత్రం కాదు