Begin typing your search above and press return to search.

హోదాపై బాబు రందికి త‌మ్ముళ్లు హాహాకారాలు

By:  Tupaki Desk   |   20 March 2018 3:39 AM GMT
హోదాపై బాబు రందికి త‌మ్ముళ్లు హాహాకారాలు
X
న‌స పెట్ట‌టంలో బాబు త‌ర్వాతే ఎవ‌రైనా అన్న విష‌యాన్ని బ‌య‌టోళ్లు కాదు టీడీపీ నేత‌లే త‌ర‌చూ చెబుతుంటారు. ఏదైనా విష‌యాన్ని తీసుకుంటే ఇక అదే ప‌నిగా దాని గురించే గంట‌లు గంట‌లు మాట్లాడ‌టం బాబుకు అల‌వాటు. నాలుగేళ్లుగా హోదా విష‌యంపై త‌న‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌జ‌ల్లో పెల్లుబికుతున్న హోదా సెంటిమెంట్ ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని తెగ ట్రై చేస్తోంది.

నాలుగేళ్లుగా బాబు ఎన్ని పిల్లిమొగ్గ‌లు వేసినా.. హోదా విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు.. ఆందోళ‌న‌లు చేప‌ట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. ఆ టైంలో అస్స‌లు రియాక్ట్ కాని చంద్ర‌బాబు.. ఇప్పుడు మాత్రం హోదాకు కేరాఫ్ అడ్ర‌స్ తానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాబులో వ‌చ్చిన మార్పు కార‌ణంగా కేంద్రం అలెర్ట్ అయ్యిందా లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీ నేత‌లు మాత్రం హాహాకారాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఉద‌యం.. మ‌ధ్యాహ్నం.. సాయంత్రం.. రాత్రి అంటూ రోజుకు మూడు.. నాలుగుసార్లకు త‌గ్గ‌కుండా హోదా మీద ఏదో ఒక కాన్ఫ‌రెన్స్ ను పెట్ట‌టం ఎక్కువైన‌ట్లుగా వాపోతున్నారు. చెప్పిందే చెబుతూ.. త‌న మాట‌లు అదే ప‌నిగా మీడియాలో క‌నిపించాల‌న్న‌ట్లుగా బాబు ధోర‌ణి ఉంద‌ని చెబుతున్నారు. గ‌డిచిన మూడు నాలుగు రోజుల్లో బాబులో హోదా రంది పెరిగింద‌ని.. దీని కార‌ణంగా త‌మ్ముళ్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయిన చెబుతున్నారు.

హోదా మీద ప్ర‌జ‌ల్లో త‌మ క‌మిట్ మెంట్ ను రిజిష్ట‌ర్ చేసుకోవాల‌ని త‌పిస్తున్న చంద్ర‌బాబు.. హోదా విష‌యానికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని.. నేత‌లంతా మాట్లాడాలంటూ చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఉద‌యం నుంచి రాత్రి మ‌ధ్య‌లు ప‌లుమార్పు టెలికాన్ఫ‌రెన్స్ లు.. త‌న రోజువారీ కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ భాగం హోదా చుట్టూనే బాబు తిప్పుతున్న తీరు చూస్తే.. హోదా మైలేజీ మొత్తం తానే సొంతం చేసుకోవాల‌న్న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. బాబు కార‌ణంగా ఏపీకి అస‌లేమీ ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ట్లుగా బీజేపీ నేత‌ల ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇప్పుడు ఏం ఇచ్చినా.. బాబు ఖాతాలోకే ప‌డుతుంద‌ని.. అలాంట‌ప్పుడు ఏపీకి ఇచ్చేది ఇవ్వ‌కుండా ఉండ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు బీజేపీ నేత‌లు స‌ల‌హా ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ఏపీ అధికార‌ప‌క్షానికి మ‌రిన్ని తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.