Begin typing your search above and press return to search.
అమరావతిపై టీడీపీ కుట్ర.. బట్టబయలు
By: Tupaki Desk | 10 Jan 2020 8:35 AM GMTఅమరావతి రాజధాని మార్పుపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై వైఎస్ జగన్ సర్కారు తగ్గకపోవడంతో ఇప్పుడు అనేక కుట్రలకు పాల్పడుతోంది. టీడీపీ తాజాగా సోషల్ మీడియాలో ఈ కుట్రలకు పాల్పడింది. అడ్డంగా దొరకడంతో టీడీపీ కుట్ర బట్టబయలు అయ్యింది.
తాజాగా టీడీపీ సోషల్ మీడియా విభాగం రాజధాని అమరావతిలో ఓ రైతు మనస్థాపం చెంది ట్రాన్స్ ఫార్మర్ పట్టుకొని చనిపోయాడంటూ విస్తృత ప్రచారం చేసింది. జనాలు, నెటిజన్లు నమ్మి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అసలు ఈ వీడియో ఎక్కడిది అని ఆరాతీయగా సంచలన విషయం వెలుగుచూసింది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. రాజధాని రైతుగా ప్రచారం చేసి టీడీపీ ఈ వీడియోను వైరల్ చేసినట్టు తేలింది. ఆ చనిపోయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వారుగా తెలియడంతో టీడీపీ కుట్ర మరోసారి బయటపడింది.
తమిళనాడులో జరిగిన ఘటనను కొంత మంది టీడీపీ మద్దతుదారులు ఏపీలోని అమరావతిలో జరిగినట్లుగా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లుగా గుంటూరు ఐజీ పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేసి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.