Begin typing your search above and press return to search.

వెన్నుపోటు ర‌చ్చ‌..వ‌ర్మ‌పై రాష్ట్రమంతా కేసులు

By:  Tupaki Desk   |   22 Dec 2018 4:17 PM GMT
వెన్నుపోటు ర‌చ్చ‌..వ‌ర్మ‌పై రాష్ట్రమంతా కేసులు
X
సంచ‌ల‌న‌ - వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మ‌రో ఊహిచ‌ని ప‌రిణామంతో వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమాలోని 'వెన్నుపోటు' పాట వివాదానికి దారితీసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌ల కాగా - తాజాగా వెన్నుపోటు అనే సాంగ్‌ ని విడుద‌ల చేశాడు. దొంగ ప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు అంటూ సాగుతున్న లిరిక్స్‌ పై సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

అయితే, ఈ పాట‌పై - వర్మపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా - ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా వర్మ వ్యవహరించారని మండిపడుతున్నారు. వర్మపై ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. చంద్రబాబుని అవమానించేలా పాట రూపొందించడం కరెక్ట్ కాదని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు పోలీస్ స్టేషన్‌లో వర్మపై ఆయన ఫిర్యాదు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ - చిత్ర బృందంపై మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఏదో చేశారని అనడం అవాస్తవం అన్నారు. ఈ సినిమా వెనుక వర్మ ఒక్కడే ఉన్నాడంటే తాము నమ్మలేము అని - వర్మ వెనుక ఉన్నవారిని కూడా గుర్తించి వారిపైనా కేసులు నమోదు చేయాలని మోహన్ రెడ్డి అన్నారు. వర్మ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో తేల్చాలన్నారు. శిఖండిలా వర్మను అడ్డుపెట్టుకుని ఆడటం కాదు.. దమ్ముంటే ఎదురుగా రావాలని ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.

అయితే, తనపై ఏపీలో టీడీపీ నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా అదే పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా వెన్నుపోటు పాట ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో వర్మపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా వర్మ వ్యవహరించారని కర్నూలు పోలీస్‌ స్టేషన్‌ లో టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వర్మపై క్రిమినల్ - పరువు నష్టం కేసులో పెట్టాలని పోలీసులను కోరారు. టీడీపీ నేతలు ఇలా ఫిర్యాదులు చేశారో లేదో.. వర్మ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదు లెటర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేను అక్కడికి వెళుతున్నా.. ఫిర్యాదు మీద ఫిర్యాదు చేస్తానని కామెంట్ పెట్టారు.