Begin typing your search above and press return to search.
మాస్టర్ ప్లాన్ పై టీడీపీ నేతల ఫైర్
By: Tupaki Desk | 21 Feb 2016 6:11 AM GMTఏపీ నూతన రాజధాని అమరావతి కోసం సీఆర్ డీఏ ప్రతిపాదించిన రీజియన్ ప్లానులో ఆగ్రికల్చరల్ జోన్లు అమల్లోకి తీసుకొస్తే తాము దేనికీ పనికిరాకుండా పోతామని, పరిరక్షణ జోన్ అనే పదాన్ని ఎత్తేసి రైతుల ఇష్టానికి వదిలేయాలని అధికార టిడిపి ఎంపి - ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పై టీడీపీ ఎంపీలు - ప్రజాప్రతినిధులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ పై కృష్ణా జిల్లా నేతలకు అవగాహన కల్పించేందుకు సీఆర్డీఏ అధికారులు ఏర్పాటుచేసిన సమావేశంలో టీడీపీ నేతలు మండిపడ్డారు. రైతులను మీ చావు మీరు చావండి అన్నట్టుగా మాస్టర్ ప్లాన్ ఉందని ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ఒకప్పుడు కోటి రూపాయలు పలికిన ఎకరం భూమి అగ్రిజోన్ కారణంగా పది లక్షలు కూడా పలకడం లేదని అన్నారు. మాస్టర్ ప్లాన్ దెబ్బకు తమ పని అయిపోయిందని... ఎక్కడికి వెళ్లినా రైతులు తిడుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తంచేశారు. చావుకెళ్లినా - పెళ్లిళ్లకు వెళ్లినా మాస్టర్ ప్లాన్ పైనే రైతులు చర్చించుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒకపక్క 8603 చదరపు కిలోమీటర్లు పట్టణ ప్రాంతంగా మారుస్తామంటూనే మరలా ఇదేమి షరతులని రామ్మోహన్ ప్రశ్నించారు. అగ్రికల్చర్ జోన్ పేరుతో కృష్ణా జిల్లాను బలి చేశారని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాగే పట్టణ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచాలని విజయవాడ ఎంపి కేశినేని నాని కోరారు. అసలు ఈ ప్లానువల్ల తమకు నష్టం వాటిల్లుతుందని, దీనివల్ల భవిష్యత్ లో నష్టపోయేది తామేనని ప్రజాప్రతినిధులందరూ ముక్తకంఠంతో చెప్పారు.
ముఖ్యంగా మస్టరు ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నవారంతా కృష్ణాజిల్లా నేతలే. అందుకు కారణం ఉంది. ఆ జిల్లా మొత్తాన్ని పూర్తిగా గ్రీన్ జోన్ గా చూపించి అభివృద్ధి జరిగే ప్రాంతాన్ని గుంటూరు కు కేటాయించారన్నది వారి వాదన. రాజధాని సమీపంలోనే వస్తున్న అగ్రికల్చర్ జోన్ల కారణంగా స్థిరాస్తి వ్యాపారానికి అవకాశం లేకుండాపోయింది. దంతో ప్రజలు, వ్యాపారుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీడీపీ నేతలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాగా అగ్రిజోన్ పై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి టీడీపీ నేతలు ఇలా అడ్డం తిరిగారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ పై అధికారుల వద్ద కాకుండా ముఖ్యమంత్రి దగ్గర పోరాడితే బాగుంటుందంటున్నారు. చూడబోతే మాస్టర్ ప్లాన్ లోని అగ్రికల్చర్ జోన్ల వ్యవహారం టీడీపీలో ముసలం పుట్టించేలా ఉంది.