Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై తెలుగుతమ్ముళ్ల కుతకుత!
By: Tupaki Desk | 10 Oct 2017 5:02 PM GMTనాయకుడనే వాడు.. తన జట్టులోని అందరి గౌరవాన్ని కూడా కాపాడే వాడిలాగా ఉండాలి. అంతే తప్ప.. సంకుచితమైన ప్రయోజనాల కోసం.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తీరులో కనిపించకూడదు. ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటే వారితో మంచిగా ఉండడం - వారితో ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవడం కోసం.. తన జట్టులోని వాళ్లను అవమానాలకు గురిచేయడం అనేది ఎక్కడైనా సరే మంచి పద్ధతి కాదు. అందుకేనేమో.. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలా మంది సీనియర్లు... చంద్రబాబునాయుడు శైలి మీద కుతకుతలాడిపోతున్నారు. ఏపీలో పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్న వారు లేకపోయినా.. లోలోపల అంతర్గత సమావేశాల్లో పార్టీ నాయకుడి గురించి మధన పడుతున్నారట.
పవన్ కల్యాణ్ తో మైత్రీ బంధం అనేది కేవలం చంద్రబాబు పాచిక మాత్రమే కాదు. పవన్ చంద్రబాబు ఒక్కడికే మిత్రుడు కాదు. గత ఎన్నికల సమయంలో అటు మోడీ - ఇటు చంద్రబాబు ఇద్దరికీ ఆయన మద్దతిచ్చారు. ఇటీవలి కాలంలో తన పార్టీ మద్దతు ఆ ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అని.. ప్రస్తుతం తాము పూర్తి స్వతంత్రంగా ఎవ్వరితోనూ పొత్తులు లేకుండా ఉన్నాం అని ఆయన పదేపదే ప్రకటించారు. ఆ రకంగా పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో బంధాన్ని విదిలించుకుని పోతోంటే.. ఇటు చంద్రబాబునాయుడు మాత్రం మళ్లీ మళ్లీ అతికించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అనే అభిప్రాయాలు పార్టీ సీనియర్ నాయకుల్లో కలుగుతున్నాయి.
ప్రత్యేక హోదా విషయంలో పార్టీ ఎంపీలు అధినేత అభీష్టానికి విరుద్ధంగా కేంద్రంతో పోరాడగలిగింది ఏమీ లేదని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా.. తెలుగుదేశం పార్టీ ఎంపీల గురించి.. పవన్ కల్యాణ్ ఎన్ని రకాల జోకులు వేసారో.. వారి ఇళ్ల దగ్గర ధర్నాలు చేయాలని పిలుపు ఇచ్చారో అందరికీ తెలుసు. తన సొంత పార్టీ మనుషుల్ని నాయకుల్ని ఎవడైనా తిడుతోంటే.. నాయకుడనే వాడు.. తనను తిట్టినట్టుగా స్పందించాలి. వాటిని ఖండించాలి. కానీ చంద్రబాబునాయుడు ఆ విషయంలో ఎన్నడూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించలేదు. పైగా పవన్ వల్ల అవమానాలు పడ్డ వారు ఆయన మీద ఎదురు జోకులు వేసినప్పుడు మాత్రం చంద్రబాబు వారిని మందలిస్తున్నారు. మంత్రి పితాని సత్యనారాయణను మందలించడం ఒక ఎత్తు, పార్టీ పునాదులనుంచి నాయకుడిగా ఉంటూ.. ఎంతో క్రెడిబిలిటీ ఉన్న హుందాగల నాయకుడిగా పేరున్న సీనియర్ అశోక్ గజపతి రాజు లాంటి వారిని కూడా పవన్ విషయంలో ఎదురుమాట్లాడ వద్దని అనడం కార్యకర్తలకు అర్థం కావడం లేదు. పితానికి మంగళవారం మళ్లీ రెడో విడత మందలింపులు వచ్చినట్లుగా వార్తలు చూసి కేడర్ నివ్వెరపోతున్నారు. పవన్, చంద్రబాబుకు మిత్రుడైతే గనుక... తమ పార్టీ వారి గురించి కామెంట్లు చేయవద్దని ఆయనకు ప్రెవేటుగా అయినా చెప్పాలి తప్ప.. ఇలా తన పార్టీ వారిని మందలించడం నాయకుడిగా ఆయనకు తగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.