Begin typing your search above and press return to search.
జగన్ మీద ఆ సెటైర్ ఇక పని చేయదేమో
By: Tupaki Desk | 18 March 2016 4:38 AM GMTవిభజన తర్వాత.. ఏపీ అసెంబ్లీ కొలువుదీరిన నాటి నుంచి ఒక అంశం ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ రావటం కనిపిస్తుంటుంది. ఇంకో లెక్కలో చెప్పాలంటే అసెంబ్లీ జరిగే ప్రతి రోజూ ఎంతలేదన్నా.. నాలుగైదు సార్ల కంటే ఎక్కువ సార్లే జగన్ కు ఈ పంచ్ ను వేయటం తెలుగు తమ్ముళ్లకు అలవాటే. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. తమ్ముళ్ల నోట ఆ మాట వచ్చేఛాన్స్ లేదని చెప్పొచ్చు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ పై ఏపీ అధికారపక్షం నేతలు తరచూ ఒక మాట మాట్లాడుతుంటారు. జగన్ కు నిబంధనలు ఏమీ తెలియవని.. సొంతంగా తెలుసుకోరని.. ఒకవేళ వివరంగా చెప్పినా ఆయన వినరంటూ అదే పనిగా ఎద్దేవా చేస్తుంటారు. ఇక.. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అయితే.. ఎటకారానికి పరాకాష్ఠ అన్నట్లుగా జగన్ ను ఏసుకోవటం కనిపిస్తుంది. యనమలకు తోడు అన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు.. దేవినేని ఉమతో పాటు సీనియర్లు ధూళిపాళ్ల లాంటి వారు తీవ్రంగా విమర్శిస్తుంటారు.
తాజాగా రోజా సస్పెన్షన్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఈ అంశాన్ని జగన్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించటమే కాదు.. సదరు సెక్షన్ కింద ఒక్క సెషన్ కు మించి సస్పెన్షన్ మాత్రమే విధిస్తారని.. ఏడాది పాటు వేటు వేయటానికి అవకాశమే లేదని నొక్కి వక్కాణించారు. జగన్ నోట ఆ మాట వచ్చినప్పుడు.. ఆయనకు ఏమీ తెలీదని.. రూల్స్ మీద అవగాహన లేని ‘పిల్లోడు’గా ఏపీ అధికారపక్షం ఓ రేంజ్ లో కామెడీ చేసుకున్నారు. తాజాగా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చూసినప్పుడు.. నిబంధనల మీద అవగాహన లేనిది జగన్ కంటే కూడా ఏపీ అధికారపక్షానికే అన్న విషయం అర్థం కాక మానదు. తాజా పరిణామాల నేపథ్యంలో రూల్స్ గురించి తెలీదు.. జగన్ ముందు వాటిని స్టడీ చేయాలన్న ఎటకారపు మాట తమ్ముళ్ల నోటి నుంచి వచ్చే అవకాశం లేనట్లేనని చెప్పక తప్పదు. అయినప్పటికీ ప్రస్తావిస్తే మాత్రం.. జగన్ టీం చేతిలో అడ్డంగా బుక్ కావటం ఖాయం.