Begin typing your search above and press return to search.
కేసీఆర్ వర్సెస్ బాబు.. మధ్యలో వర్మ
By: Tupaki Desk | 30 Dec 2018 4:50 AM GMT‘చంద్రబాబు పచ్చి అవకాశవాది.. వాడుకొని వదిలేయడంలో నంబర్ వన్’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాలు చెప్పేసరికి టీడీపీవోళ్లు బట్టలు చింపుకుంటున్నారు. బాబు అనుయాయులు కేసీఆర్ పై దాడి మొదలెట్టేశారు. చంద్రబాబుపై నిజాలు బయటపెడుతావా అంటూ విరుచుకుపడుతున్నారు.
‘నందమూరి హరికృష్ణ మరణంపైనా బాబు రాజకీయాలు చేశారని.. తన రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారని.. ఆయన రాజకీయ నాయకుడు కాదు.. ఓ మేనేజర్’ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లు ఏపీలో టీడీపీని షేక్ చేస్తున్నాయి. బాబును తీవ్ర ఇరకాటంలో పెడుతున్న ఈ విమర్శలను తిప్పికొట్టడానికి టీడీపీ కోటరి రంగంలోకి దిగింది.
చంద్రబాబును, టీడీపీ ఏమన్నా అన్నా ఒంటికాలిపై మొదట లేసే ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ది దరిద్రమైన భాష అంటూ సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఏం మోసం చేశారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ భాషను ఎవరూ హర్షించరన్నారు. తెలుగు లిటరేచర్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసి మాటల మరాఠీగా పేరొందిన కేసీఆర్ భాషకే సోమిరెడ్డి వెక్కించడం గమనార్హం.
తెలంగాణలో గెలవగానే విర్రవీగతున్నారని.. ముగిసింది తెలంగాణ ఎన్నికలేనని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు చుక్కలు చూపిస్తామని మంత్రి దేవిని ఉమ నిప్పులు చెరిగారు. మరి అఖండ మెజార్టీతో టీఆర్ ఎస్ కు పట్టం కట్టిన జనాలు.. ఆరు నెలల్లోనే తమ మనసును ఎలా మార్చుకుంటో దేవినేని జనాలు చెబితే బాగుంటుందని టీఆర్ ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇక చంద్రబాబును చెడామడా తిట్టేసిన కేసీఆర్ వివాదాన్ని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా వాడేసుకున్నాడు. ప్రస్తుతం ‘లక్ష్మీ ఎన్టీఆర్’ చిత్రంతో బిజీగా ఉన్న వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘కేసీఆర్ ముందుపోటు మాత్రమే పొడుస్తారని.. వెన్నుపోటు పొడవరని.. అందుకే ఆయన అంటే తనకు ఇష్టం’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు చేసిన ట్వీట్ లో ‘కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మరో కేసు పెట్టినట్లు తెలిసిందని వర్మ వ్యాఖ్యానించారు.
Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?