Begin typing your search above and press return to search.
జగన్ ఫ్యాన్స్ ఎవరో చెప్పేసిన టీడీపీ
By: Tupaki Desk | 18 Oct 2016 12:44 PM GMTఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలపై అధికార తెలుగుదేశం నేతలు విమర్శల దాడిని ఉధృతం చేశారు. వేదిక ఏదైనా ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్న తెలుగుతమ్ముళ్లు ఈ క్రమంలో వైసీపీతో పాటు మరో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో చేయని అభివృద్ధిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తోందని కాంగ్రెస్ - వైకాపాలు అసంతృప్తితో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీ రాష్ట్రంలో తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని, అయితే కాంగ్రెస్ - వైకాపా విమర్శలను ప్రజలు పట్టించుకునే స్థితిలే లేరని గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి చూసి ఓర్వలేకే చంద్రబాబు - లోకేశ్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని రఘువీరారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు నకిలీ విత్తనాలు - ఎరువులు ఇచ్చిన ఘనుడు రఘువీరారెడ్డి అని గాలి ఎద్దేవా చేశారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. వైసీపీ మౌత్ పీస్ లాగా కాంగ్రెస్ పార్టీ మారిందని ఎద్దేవా చేశారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి - ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధినేత జగన్ అమ్ముల పొదిలో అస్త్రాలుగా మారారని వర్ల రామయ్య విమర్శించారు. వైసీపీ నేతలకంటే కమ్యూనిస్టులే జగన్ ను ఎక్కువ పొగుడుతున్నారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జగన్ కు వైసీపీలో కంటే వామపక్షాల్లోనే ఎక్కువ అభిమానులు ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. లెఫ్ట్ పార్టీలు జగన్ కు తోక పార్టీలుగా మారాయని వర్ల విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/