Begin typing your search above and press return to search.
రేవంత్ కుమార్తె నిశ్చితార్థం టీడీపీ కార్యక్రమం
By: Tupaki Desk | 9 Jun 2015 9:31 AM GMTఓటుకు నోటు కేసులోబుక్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి పార్టీ అండగా నిలవాలని డిసైడ్ అయ్యింది. కుట్రపూరితంగా వ్యవహరించిన తెలంగాణ అధికారపక్షం తమ ఎమ్మెల్యేని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. అందుకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ను పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని భావిస్తోంది.
ఈ నెల 11 తేదీన రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జైల్లో ఉన్న రేవంత్‌కు.. బెయిల్ వచ్చే అవకాశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలిన తొలుత భావించారు. అయితే.. అనుకున్న విధంగా ఎంగేజ్‌మెంట్ జరగాలని రేవంత్‌రెడ్డి బలంగా భావించటంతో.. ఆ కార్యక్రమాన్ని యథాతధంగా నిర్వహించాలని నిర్ణయించారు.
రేవంత్ జైల్లో ఉన్న నేపథ్యంలో.. వారి కుటుంబం తీవ్ర వేదనలో మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో శుభకార్యం నిర్వహించటం ఎందుకన్న భావన వ్యక్తమైనప్పటికీ.. రేవంత్ మాత్రం తను హాజరైనా.. కాకున్నా నిశ్చితార్థం అనుకున్నట్లే జరగాలని భావిస్తున్నారు. దీంతో.. రేవంత్ ఇంట జరిగే కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సహా.. ఏపీ రాష్ట్ర మంత్రులు.. కీలక నేతలంతా హాజరు కావాలని భావిస్తున్నారు. రేవంత్‌కు పార్టీ మొత్తం అండగా ఉందన్న సందేశాన్ని పంపించటమే లక్ష్యంగా భావిస్తున్నారు. ఏదిఏమైనా పార్టీ నేత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. వారి కుటుంబాన్ని వదిలేయకుండా పార్టీ అండగా నిలవటం అభినందించాల్సిన అంశమే.