Begin typing your search above and press return to search.
అంతర్గత సర్వేతో 'దేశం' లో అయోమయం...
By: Tupaki Desk | 8 Aug 2018 5:26 PM GMTతెలుగుదేశం పార్టీ అధ్యక్షడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో గట్టేక్కే అవకాశాలున్నాయా? లేవా .? అని మధనపడుతున్నారు. గత ఎన్నికలలో బొటాబొటీ మేజారీటితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈసారి ఆ పరిస్థితి తారుమారు అవుతుందా అని దిగులుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దూరం కావడం నానాటికి జగన్ మోహాన రెడ్డికి ఆదరణ పెరుగుతుండడం చంద్రబాబు కలతకు కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకపోయినా తన పదవిని మాత్రం ఊడగొట్టే అవకాశాలున్నాయని భయపడుతున్నారు. ఇంతటి భయాందోళనలకు కారణం చంద్రబాబు నాయుడు అంతర్గతంగా చేయించుకున్న సర్వేలే అని అంటున్నారు. రాష్ట్రా వ్యాప్తంగా 13 జిల్లాలలో దాదాపు వంద నియోజకవర్గాలలో గ్రామీణ స్ధాయిలో నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లుగా వెల్లడయింది అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మోహాన రెడ్డికి అనుకూల పవనాలు వీస్తునట్లుగా బహిర్గతమైయింది అని అంటున్నారు.
తన పార్టీ వారు - ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంస్థలు కాకుండా ముంబయ్ కి చెందిన ఒక సంస్థ చేత ఈ సర్వే చేశారట. సర్వేలో ప్రభుత్వ పని తీరు ముఖ్యమంత్రి పని తీరు మంత్రుల - శాసన సభ్యుల - నాయకుల వ్యవహార శైలిపై సర్వే చెప్పారట. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలున్నాయి అనే అంశంపై సర్వేలో ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరించారట. ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరుపై 34 శాతం మంది మాత్రమే ఆనందాన్ని వ్యక్తపరిచారట. మంత్రులలో కొందరికి మంచి మార్కులే పడ్డాయి గానీ శాసనసభ్యులు - నాయకుల్లో చాలా మంది పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో వెలుగుచూసిందట. ఇసుక దందా - ప్రభుత్వ అధికారుల పట్ల శాసన సభ్యులు - నాయకులు వ్యవహరించిన తీరు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా వెల్లడించారట. మరోసారి వీరు అధికారంలోకి వస్తే మరింతగా అవినీతి - అక్రమాలు పెరిగిపోతాయని ప్రజలలో ఓ భావన నెలకొన్నట్లు సర్వే ద్వారా తేటతెల్లమయింది అని అంటున్నారు. ఇక ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పట్ల తెలుగదేశం పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలింది అని అంటున్నారు. హోదా కోసం పోరాడకుండా ప్యాకేజీ వైపు చంద్రబాబు మొగ్గు చూపడం ప్రజలలో అసహనం తీసుకువచ్చింది. రాష్ట్రానికి హోదా వస్తే నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించడంతో ప్రజలలో తీవ్ర నిరాశ నెలకున్నట్లు సర్వేలో వెల్లడయింది అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సర్వే నిజాలు చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టనివ్వడం లేదని చెబుతున్నారు. ఆయన భయాలు నిజామవుతాయని సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు.