Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రలో రాజకీయ వేడి తప్పదా ?
By: Tupaki Desk | 5 Sep 2021 12:30 AM GMTఉత్తరాంధ్రలో రాజకీయ వేడి రగులుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే నాలుగు రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల టీడీపీ నేతలు పెద్ద సమావేశం పెట్టుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు వైసీపీ నేతలపై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ ఆరోపణలు, విమర్శలపై ఇంతవరకు వైసీపీ నేతల నుండి రిటార్ట్ రాలేదు. కారణం ఏమిటా అని ఆరాతీసిన వారికి ఓ సమాధానం దొరికింది.
అదేమిటంటే శనివారం అధికార పార్టీ నేతలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట. ఈ సమావేశంలో ఏ ఏ అంశాలపై చర్చించుకున్నారు అనే విషయంలో క్లారిటీ లేకపోయా మొత్తంమీద టీడీపీ నేతల ఆరోపణలు, విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలని మాత్రం డిసైడ్ చేశారట. ఈ సమావేశానికి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు మేయర్, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్మన్లు కూడా హాజరయ్యారట. కీలకమైన సమావేశానికి విజయసాయిరెడ్డి నాయకత్వం వహించారు.
మరింత మంది నేతలు సమావేశమైన తర్వాత టీడీపీ నేతల ఆరోపణలు, విమర్శలపై ఎలా దాడి మొదలుపెట్టాలా ? అన్న విషయం తేల్చకుండా ఉంటారా ? అదీ జరిగే ఉంటుంది కానీ ఏ రూపంలో ? ఎప్పటి నుండి మొదలు పెడతారు అనే విషయాన్ని మాత్రం సీక్రెట్ గా ఉంచారు. ఇప్పటికే మాన్సాస్ ట్రస్టు వివాదం, సింహాచలం దేవస్ధానం భూముల కుంభకోణం, వైజాగ్ కేంద్రం టీడీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలు తదితర అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా హాట్ గా హాట్ గా నడుస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలో చైతన్యం తేవడానికి తొందరలోనే బస్సు యాత్ర చేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. మరి ఇంతే స్థాయిలో వైసీపీ నేతలు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే విషయం తెలీలేదు. సమావేశం వివరాలను ఎలాగూ వైసీపీ నేతలు మీడియాకు చెబుతారు. అప్పుడు వీళ్ళ సమావేశంపై ఓ క్లారిటి వస్తుందనే అనుకోవాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మాత్రం రాజకీయంగా హాటు హటుగా మారిపోయే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తోంది.