Begin typing your search above and press return to search.
ఒకరికి బుల్లెట్ దెబ్బ!... ఇద్దరికి వడ దెబ్బ!
By: Tupaki Desk | 31 March 2019 5:52 PM GMT2019 ఎన్నికలు... అటు విపక్ష వైసీపీతో పాటు ఇటు అధికార టీడీపీకి కూడా అత్యంత కీలకమైన ఎన్నికలే. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏపీలో ఇప్పడు పొలిటి్కల్ హీట్ మామూలుగా లేదనే చెప్పాలి. అదే సమయంలో సూర్యుడు కూడా మంట పుట్టించేస్తున్నాడు. ఇటు పొలిటికల్ పీవర్... అటు భానుడి ప్రతాపం... వెరసి నేతలు తలకిందులు అవుతున్నారు. మండుటెండలో ప్రచారం అంటే మాటలు కాదు కదా. ఈ విషయంపై మంచి అవగాహనతోనే ముందుకు సాగుతున్న నేతలు.... వడ దెబ్బ నుంచి తమను తాము రక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయినా కూడా ఇప్పటికే ఇద్దరు నేతలు వడ దెబ్బకు గురయ్యారు. ఈ ఇద్దరు కూడా అధికార టీడీపీకే చెందిన వారు కావడం గమనార్హం.
మొన్నటికి మొన్న టీడీపీ సీనియర్ నేత - అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రచారంలో భాగంగా వడ దెబ్బకు గురయ్యారు. వాగ్దాటిలో మంచి పట్టున్న నేతగా ఉన్న పయ్యావుల వడ దెబ్బ కారణంగా కొంత సమయం ఇంటిపట్టునే ఉండిపోవడంతో టీడీపీకి పెద్ద నష్టమే జరిగిందన్న వాదన కూడా లేకపోలేదు. తాజాగా రాజకీయంగా టీడీపీకి కీలక జిల్లాగా ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే - ప్రస్తుతం అక్కడే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బోడె ప్రసాద్ కూడా వడ దెబ్బకు గురయ్యారు. ఆదివారం నాటి ప్రచారంలో భాగంగా మండుటెండలోనే సైకిలెక్కి ప్రచారం చేస్తున్న బోడె... ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో షాక్ తిన్న అనుచరులు... ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా... బోడెకు వడ దెబ్బ తగిలిందని వైద్యులు నిర్ధారించారు. ఫలితంగా కనీసం రెండు రోజులైనా రెస్ట్ తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్న బోడె... ప్రచారానికి స్వల్ప విరామం ఇవ్వక తప్పదు.
ఇదిలా ఉంటే... వడ దెబ్బ టీడీపీ నేతలను కలవరపెడుతుంటే... అంతకంటే ముందే ఆ పార్టీకే చెందిన మరో అభ్యర్థికి ఏకంగా బుల్లెట్ దెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి.... మొన్న వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి స్వగ్రామంలో ప్రచారం చేస్తుండగా జరిగిన గొడవల్లో పొరపాటున గన్ మన్ చేతిలోని తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఆయన తొడలోకి దూసుకెళ్లింది. దీంతో ఆసుపత్రిలో చేరిన తిక్కారెడ్డి చికిత్స తీసుకుని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏకంగా స్ట్రెచర్ పై బయటకు వచ్చారు. ప్రచార రథంపై స్ట్రెచర్ వేసుకుని దానిపై పడుకుని తిక్కారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్న తీరు ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలా ఇటు బుల్లెట్ దెబ్బలు - అటు వడ దెబ్బలతో టీడీపీ నేతలు సతమతమవుతున్నారని చెప్పక తప్పదు.