Begin typing your search above and press return to search.
బాబూ... ఇసుక దోపిడీ ఆగలేదుగా
By: Tupaki Desk | 14 Oct 2017 4:43 AM GMTఇసుక దోపిడీ ఇక నుంచి ఆగిపోవాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు- ఖచ్చితంగా ఓ పదిహేను రోజుల కిందట టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ పార్టీ నేతలను పిలిచి మరీ ఇచ్చిన వార్నింగ్ ఇది. దీంతో అంతా సరై పోతుందని, తమ్ముళ్లు లైన్‌లోకి వచ్చేస్తారని, ఇసుక దోపిడీకి అడ్డుకట్టపడుతుందని అందరూ అనుకున్నారు. అలా జరిగి ఉంటే ఇప్పడు ఇలా చెప్పుకొనే పనేముంటుంది. అంతా మామూలే..! బాబు బాబే.. తమ్ముళ్లు.. తమ్ముళ్లే..! విషయంలోకి వెళ్తే.. ఇసుక ఇప్పుడు టీడీపీ నేతలకు బంగారం! ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని పలుకూరు పంచాయతీ పరిధి వెంకన్నపాలెం - విక్కిరాలపేట పంచాయతీ మధ్యలో ఉన్న పాలేరు ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. దీనిని కనిపెట్టిన టీడీపీ నేతలు స్వయంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి మరీ ఇసుకను అమ్మేస్తూ.. కోట్లకు పడగలెత్తేస్తున్నారు.
పాలేరులోకి వెంకన్నపాలేనికి చెందిన ట్రాక్టర్లు - విక్కిరాలపేట సమీపంలో ఆ గ్రామానికి చెందిన ట్రాక్టర్ లు ఎక్కువగా వెళ్లి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. ఆయా ట్రాక్టర్ల యాజమానులకు స్నేహితులు - అనుచరులుగా ఉన్న వారి ట్రాక్టర్లు కూడా వచ్చి ఇసుక తీసుకెళ్తున్నాయి. రోజుకు 200 ట్రిప్పులకుపైగా ఇసుక తరలి వెళ్తోంది. కందుకూరుకు ఇసుక తరలించాలంటే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. సింగరాయకొండ - జరుగుమల్లి - టంగుటూరుకు రూ.2 వేలకుపైగా తీసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ యాజమాని రోజుకు నాలుగు నుంచి ఐదు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. వేకువ జామున - సాయంత్రం సమయంలో మాత్రమే ఇసుక కొల్లగొడుతున్నారు. వెంకన్నపాలెం వద్ద సుమారు 30 అడుగులకు పైగా తవ్వకాలు జరిపారు. పాలేరులో చివరకు నేల కనిపిస్తోంది. ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయితే, తమ్ముళ్ల రంగ ప్రవేశంతో అధికారులు అనుమతి ఇచ్చేస్తున్నారు.
అయితే, ఈ అనుమతులు గోపాలపురం వద్ద ఇసుకకు తీసుకొని వెంకన్నపాలెం - విక్కిరాలపేట వద్ద ఉన్న పాలేరు నుంచి కూడా ఇసుకను భారీగా తరలిస్తుండడమే విశేషం. ఇక, ఇసుక లోడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుంటే ఆ ట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడిదై ఉంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అదే ట్రాక్టర్ సాధారణ వ్యక్తిదై ఉంటే డ్రైవర్ జైలుకు - ట్రాక్టర్ సీజ్ - జరిమానా విధిస్తున్నారు. ట్రాక్టర్ల యాజమానులు(తమ్ముళ్లు) ఇసుక తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. కొందరు ట్రాక్టర్ యాజమానులు ముందుగానే అధికారులతో మాట్లాడుకొని మామూళ్లు ఇస్తున్నారు. ఆ ట్రాక్టర్లు ఇసుకను తరలించే సమయంలో ఏ అధికారీ ఆ వైపు వెళ్లరు. మిగిలిన ఏ ట్రాక్టర్ వెళ్లినా వెంటనే అధికారులు ప్రత్యక్షమై వారిని జైలుకు పంపించేస్తున్నారు. మరి ఇదీ.. బాబు గారి జమానాలో ఇసకేస్తే కూడా రాలని అవినీతి!!