Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలు.. అప్పుడే పక్క చూపులా!

By:  Tupaki Desk   |   28 May 2019 7:54 AM GMT
టీడీపీ నేతలు.. అప్పుడే పక్క చూపులా!
X
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి నేటితో ఐదో రోజే. మళ్లీ ఎన్నికలు రావడానికి ఐదేళ్ల సమయం ఉంది. అయితే అప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలు పక్క చూపులు చూస్తూ ఉండటం గమనార్హం. ఎన్నికల ఫలితాలు అలా వెల్లడిఅయ్యాయో లేదో.. అప్పుడే కొందరు తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కకపోవడంతో వారు ఆ పార్టీని వీడెందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లినా అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే వీరిని తీసుకోరు. ఫిరాయింపు రాజకీయాల విషయంలో జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు జగన్ కు ఫిరాయింపులతో పనే లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉన్నా జగన్ మోహన్ రెడ్డి వారి ని తీసుకునే అవకాశాలు లేవు. జగన్ కు ఏపీ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి నేతలను తీసుకునే అవకాశాలు ఏ మాత్రం లేవు!

ఇది తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించాలనుకునే వారిని నిరాశ పరిచే అంశమే. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఆగడం లేదు. అప్పుడే కొందరు జగన్ తో టచ్లోకి వెళ్లేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉన్నారు.

మరి కొందరు మాత్రం భారతీయ జనతా పార్టీ తలుపుతట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని సమాచారం. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎలాగూ అధికారం దక్కలేదు. కేంద్రంలో అయితే బీజేపీకి అధికారం దక్కింది. ఏదోలా అధికార పార్టీలో ఉన్నట్టుగా అనిపించుకోవడానికి వారిలో కొందరు బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.

ప్రత్యేకించి అవినీతి కేసుల భయం ఉన్న వారు ఆ ప్రయత్నంలో ఉన్నారని టాక్. తెలుగుదేశం హయాంలో భారీగా అవినీతికి పాల్పడిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో వణుకుతున్నారు. అధికారం తెలుగుదేశం చేజారడంతో వారు ఇబ్బందుల్లో పడ్డారు. అందుకే ఇప్పుటు టక్కున బీజేపీలోకి చేరిపోయి, ఎంతో కొంత సేఫ్ కావాలని వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం. మరి ఆల్రెడీ అవినీతి కేసుల కూపంలో ఉంటూ, ఇప్పుడు కేవలం వాటి నుంచి తలదాచుకోవడానికి బీజేపీని ఆశ్రయించే వారిని కమలం పార్టీ అక్కున చేర్చుకుంటుందా? అనేది శేష ప్రశ్న.