Begin typing your search above and press return to search.
షాతో తమ్ముళ్ల మీటింగ్.. కొత్త కుట్రకు తెర తీస్తున్నారా?
By: Tupaki Desk | 4 Dec 2019 9:38 AM GMTఏపీలో జగన్ సర్కారుకు వస్తున్న ప్రజాదరణ రాష్ట్రంలోని ప్రధాన విపక్షమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కూడా మింగుడుపడటం లేదా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. యువకుడైన జగన్ ముఖ్యమంత్రి బాధ్యతల విషయంలో తడబాటుకు గురయ్యే అవకాశం ఉందని.. కంట్రోల్ చేయొచ్చన్న తమ ఆలోచనలకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటంపై కమలనాథులు కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు.
తన గొయ్యి తానే తీసుకున్న బాబు ఏపీ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ ను దారికి తెచ్చుకోవటానికి వీలుగా వ్యహం పన్నిన కమలనాథులకు.. యువనేత తీరు ఏ మాత్రం కొరుకుడు పడటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన భారతదేశ మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి లేకుండా బయటకు రావటం.. అదో ఇష్యూ కావటం తెలిసిందే.
దీనిపై ఫెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో ప్రశ్నించటం.. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో అమరావతి పేరుతో కొత్త మ్యాప్ ను విడుదల చేసింది కేంద్రం. తమ విన్నపాన్ని మన్నించి అమరావతి పేరుతో ఉన్న దేశ పటాన్ని విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పేందుకు టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
పేరుకు కృతజ్ఞత సమావేశమైనా.. జరిగింది మాత్రం వేరుగా ఉందంటున్నారు. ఏపీ సీఎం జగన్ ను తాము తట్టుకోలేకపోతున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు వాపోయినట్లు తెలుస్తోంది. తమ క్యాడర్ మీద ఏపీలో దాడులు జరుగుతున్నాయని.. తమ మీద మాత్రమే కాదు బీజేపీ కార్యకర్తల మీదా జగన్ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేయటం గమనార్హం. దీనిపై ఆచితూచి స్పందించిన అమిత్ షా.. మరో రోజు తీరిగ్గా కూర్చుందాం.. అపాయింట్ మెంట్ తానే ఫిక్స్ చేస్తానని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎక్కడైనా తమ సమస్యలు చెప్పుకునే వేళ.. బీజేపీ పరిస్థితి కూడా తమ్ముళ్లు ప్రస్తావిస్తున్న వైనాన్ని చూస్తే.. తెర వెనుక ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.