Begin typing your search above and press return to search.
లోకేష్ కి జై... టీడీపీలో అంతా సెట్ అయినట్లే...?
By: Tupaki Desk | 11 Jan 2023 2:30 AM GMTలోకేష్ ని ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు లైట్ తీసుకునే వారు. తమకు చంద్రబాబే అధినేత అని భావించేవారు. అంతే కాదు ఆయన చెబితేనే వింటామని కూడా పట్టుబట్టి కూర్చునే వారు. ఇది ఈ రోజు మాట కాదు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉండగానే జరుగుతూ వచ్చింది. ఆనాడు తెలుగుదేశానికి తెర వెనక చక్రం తిప్పుతూ వచ్చిన లోకేష్ పార్టీ అధికారంలోకి రావడంతో పవర్ ఫుల్ గా మారారు.
అయినా సరే చంద్రబాబు చుట్టే అంటూ సీనియర్లు వ్యవహరించేవారు. ఇక చూస్తే 2017లో లోకేష్ ని మంత్రిగా చేసి అయిదు శాఖలు అప్పగించినా చాలా మంది సీనియర్లు మాత్రం ఆయనతో కలవడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు అంటారు. ఇక లోకేష్ మాత్రం చంద్రబాబు తరువాత తానే అన్నట్లుగా పార్టీలో ప్రభుత్వంలో వ్యవహరించేవారు.
ఈ రకమైన వాతావరణం వల్ల కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడానికి కారణం అయింది అని అంటారు. విపక్షంలోకి పార్టీ వచ్చి దాదాపుగా నాలుగేళ్ళు అవుతోంది. పార్టీ కోసం ఒక వైపు చంద్రబాబు మరో వైపు లోకేష్ జనంలోకి వస్తూ హడావుడి చేశారు. పార్టీలోని నాయకులు చాలా మంది మాత్రం యాక్టివ్ కాలేకపోయారు.
ఏది ఏమైనా 2022 తెలుగుదేశానికి బాగా కలసివచ్చింది. దాంతో బాదుడే బాదుడు, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో పాటు లోకేష్ కష్టం కూడా ఫలించింది. ఆయన చుట్టూ యువతరం నాయకులు క్యూ కడుతున్నారు. ఇక లాభం లేదని సీనియర్లు ఒక్కొక్కరుగా భేషజాలు విడిచి కలుస్తున్నారు. తెలుగుదేశం భావి నాయకుడిగా లోకేష్ పాదయాత్ర సైతం చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇమేజ్ మరో యాంగిల్ లో మరో స్థాయిలో ఫోకస్ అయ్యేలా అధినాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక తెలుగుదేశంలో అన్నీ తానే అని చంద్రబాబు అంటున్నా ఆయనకు తోడుగా నీడగా లోకేష్ ఉన్నారు. చంద్రబాబు నిర్ణయాలను సైతం లోకేష్ ప్రభావితం చేస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతల విషయంలో లోకేష్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. వారికి బదులుగా యువరక్తం కొత్త నీరుని ప్రవేశపెట్టాలని లోకేష్ పట్టుబడుతున్నారు. దాంతో చాలా చోట్ల పాతుకుపోయిన సీనీయర్లలో కలవరం రేగుతొంది.
గత ఏడాది ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా రెండు సాల్రు వరసగా ఓడిన వారికి టికెట్లు వద్దు అని పార్టీ నిర్ణయం తీసుకుంటోందని చెప్పి లోకేష్ సీనియర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో చంద్రబాబుతో ఇంతకాలం సాన్నిహిత్యం నెరుపుతూ వస్తున్న సీనియర్లు ఇపుడు చినబాబుని కూడా ప్రసన్నం చేసుకోకతప్పడంలేదు అని అంటున్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా యువరక్తం అవసరం పడుతోంది.
అదే టైంలో పార్టీలో జనరేషన్ గ్యాప్ లేకుండా చూసుకునేందుకు ఎక్కువ మంది జూనియర్లకు అవకాశాలు ఇవ్వాలని లోకేష్ ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్లు తమకు కాకపోయినా తమ వారసులకు అయినా టీడీపీలో చోటు చూసుకునేందుకు లోకేష్ ని అనివార్యంగా కలవాల్సి వస్తుంది. భేషజాలు విడిచి మరీ చినబాబుకు జై అని అంటున్నారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లోకేష్ ని కలవడం ఆసక్తిని రేపే అంశం అవుతోంది. వచ్చే ఎన్నికలలో తనకు కాకపోయినా తన కుమారుడికి అయినా రాజకీయంగా భవిష్యత్తు కోసమే గంటా లోకేష్ ని కలిశారు అని అంటున్నారు. అలాగే మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు కూడా తన కుమార్తెకు టికెట్ కోసం చూస్తున్నారు. ఆయన సైతం లోకేష్ కి టచ్ లో ఉంటున్నారు.
ఇక ఒకనాడు జూనియర్ ఎన్టీయార్ అని నినదించిన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా లోకేష్ కి బర్త్ డే విషెస్ ని గత ఏడాది చెబుతూ హడావుడి చేశారు. ఇపుడు లోకేష్ బాటలో ఆయన నడుస్తున్నారు. దీంతో సీనియర్లు అంతా కూడా చంద్రబాబు కంటే కూడా చినబాబుతో భేటీ అయ్యేందుకు చూస్తున్నారు. ఇది పార్టీలో లోకేష్ కి పెరిగిన పట్టుకు నిదర్శనం అంటున్నారు. లోకేష్ పాదయాత్ర కనుక పూర్తి చేస్తే ఇక ఆయన తెలుగుదేశంలో తిరుగులేని నాయకుడిగా మారుతారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.