Begin typing your search above and press return to search.
ఈ మార్ఫింగ్ ఆనందం ఏమిటి తమ్ముళ్లు?
By: Tupaki Desk | 16 Jan 2020 8:18 AM GMTఉత్సాహం ఉండాలి. అది అందరూ స్వాగతించేలా ఉండాలి. భలే చెప్పాడోయ్.. అన్నట్లుగా ఉండాలే కానీ.. ఉత్సాహం అత్యుత్సాహంగా అస్సలు ఉండకూడదు. తెలుగుతమ్ముళ్లు సంక్రాంతి పండుగ వేళ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వైరల్ గా మారింది. రాబోయే కాలానికి కాబోయే ఏపీ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ (తారక్) అని పేర్కొనటమే కాదు.. రాబోయే కాలాన్ని 2024ను చూపిస్తూ.. కాబోయే ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని పేర్కొనటం గమనార్హం.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన దారుణ ఫలితాలతో తెలుగుదేశం పార్టీని ఎంతలా దెబ్బ తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకూ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురు నేతలు బాబును వదిలేసి తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ తమ దారిన తాము వెళ్లిపోయారు. ఓవైపు నాయకత్వ సమస్యలు.. మరోవైపు లోకేశ్ తలనొప్పులతో పాటు.. పార్టీ అధికారపక్ష నేతగా బాబు వ్యవహరశైలి నచ్చక వెళ్లిపోతున్న వారు లేకపోలేదు. దీంతో.. టీడీపీ తాజా పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరి మారిందన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
ఇలాంటివేళ.. టీడీపీకి పొలిటికల్ మైలేజీ రావాలంటే తారక్ పార్టీ సారథ్యం చేపట్టాలన్న డిమాండ్ పలువురిలో ఉంది. దీనికి తగ్గట్లే తాజాగా సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పండుగ సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఉన్న కంటెంట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఎన్టీఆర్ పేరునుపూర్తిస్థాయిలో రాసేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సచివాలయంలో సీఎం ఛైర్ లో కూర్చున్నట్లుగా తారక్ ఫోటోను ఏర్పాటు చేయటమే కాదు.. నేమ్ ప్లేట్ కూడా మార్ఫింగ్ చేసేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ ఫ్లెక్సీ సంచలనంగా మారింది.