Begin typing your search above and press return to search.
కమలం గూటికి చేరిన తమ్ముళ్లంతా తిరిగి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు?
By: Tupaki Desk | 25 Oct 2021 5:28 AM GMTబెల్లం చుట్టూనే ఈగలు తిరుగుతూ ఉంటాయి. రాజకీయ నేతల్ని చూసినంతనే.. బెల్లం.. ఈగల ఉదంతం గుర్తుకు రావటం ఖాయం. ఎక్కడో ఒకట్రెండు చోట్లతప్పించి.. మిగిలిన వారి దారి ఒకేలా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. గతంలో మాదిరి పార్టీలు.. సిద్ధాంతాలు.. కమిట్ మెంట్లు.. విలువలతో కూడిన రాజకీయన్ని పదర్శించటం మానేసి చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడంతా ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటం.. ఏ రోజు ప్రయోజనం అదే రోజుకు.. లేదంటే మరో రోజుకే తప్పించి.. మరే మాటకు అవకాశం లేకుండా పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో.. పార్టీ అధినేతలు సైతం ఇలాంటి వారి ఎత్తులకు చిత్తు అవుతూ.. వారిని ఏదోలా తమ పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా రాజకీయ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు.2014లో జరిగిన ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన నేతలు.. 2019 ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత బీజేపీలోకి గుండు గుత్తుగా బీజేపీ తీర్థం తీసుకోవటం తెలిసిందే. దీంతో టీడీపీ కార్యవర్గమంతా తిట్టే పరిస్థితి.
కాలక్రమంలో రెండున్నరేళ్లు ముగిసిపోవటం.. అధికార పార్టీ మీద వ్యతిరేకత మొదలైందని.. ప్రజల్లోనూ ఆగ్రహం అంతకంతకూ పెరిగిపోతున్న వౌనాన్ని గుర్తు చేసుకున్న వారంతా .. ఇప్పుడు మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సిద్హతుతున్నారు. దీనికి తోడు మరో రెండున్నరేళ్ల కాలంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటం.. ఇటీవల కాలంలో ముందస్తుకు జగన్ వెళతారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళలో తాము ముందే మేల్కొని సైకిల్ ఎక్కేయాలనన ఆలోచనలో వారు ఉంటే.. బాబు ఆలోచన మరోలా ఉందట.
ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు వేర్వేరు పార్టీల్లో చేరిపోయిన వేళ.. తిరిగి వస్తామన్న పార్టీ నేతలకు అడ్డంకి కలుగకుండా బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు.సీనియర్లు పార్టీలోకి తిగిర వస్తే.. పార్టీ మరింత బలోపేతం అుతుందన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సుజనా.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్.. గరికపాటి మోహన్ రావు లాంటి వారు బీజేపీలో చేరారు. తమకు తోచినట్లుగా.. తమ రాజకీయ ప్రయోజనాల్ని మాత్రమే చూసుకునే వారు.. తప్పించి పార్టీ గురించి ఆలోచించలేదని.. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిస్తే మంచిదంటున్నారు. చంద్రబాబు ఏం చేస్తారో మరి?