Begin typing your search above and press return to search.

బాబు బాయ్‌ కాట్ అస్త్రం..జ‌గ‌న్ షాకుల‌కు భ‌యంతోనేనా?

By:  Tupaki Desk   |   26 Jan 2020 2:35 PM GMT
బాబు బాయ్‌ కాట్ అస్త్రం..జ‌గ‌న్ షాకుల‌కు భ‌యంతోనేనా?
X
ఏపీలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్.... ఆ రాష్ట్ర శాస‌న‌మండ‌లి. వికేంద్రీకరణ - సీఆర్డీఏ చట్ట ఉపసంహరణ బిల్లులకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా భ‌విష్య‌త్తులోనూ స‌మ‌స్య‌ల‌కు అడ్డుకాకుండా ఉండేందుకు...ఏపీ సీఎం జ‌గ‌న్ డిసైడ‌యిన‌ట్లు స‌మాచారం. సోమ‌వారం ఉదయం 09.30కి ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది, ఈ భేటీలో మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలపనున్న కేబినేట్ తదుపరి చర్యలకి ఉపక్రమించనుంది. అయితే, ఈ స‌మ‌యంలో సోమవారం జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది.

మండలి రద్దుకు సీఏం జ‌గ‌న్ డిసైడ‌య్యారు. రేపే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నా బేరసారాలకు అవసరం లేదన్న జగన్ తనను చంద్రబాబులా తయారు చేయద్దని నిర్మొహమాటంగా చెప్పినట్టు సమాచారం. ఇలా ప్ర‌భుత్వం క‌రాఖండిగా ఉన్న స‌మ‌యంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశం అయింది. అసెంబ్లీ సమావేశాలు - మండలి రద్దు అంశాలపై చ‌ర్చించింది.టీడీపీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా హాజ‌రైన ఈ స‌మావేశంలో మండలి విషయాలు అసెంబ్లీలో చర్చించడం ఏంట‌నే ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. టీడీపీ అభ్యంతరాల‌ను ప్ర‌భుత్వం బుల్‌ డోజ్ చేసే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో....అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్‌ కాట్ చేయాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.