Begin typing your search above and press return to search.
బాబు వెళ్లారు.. 'తమ్ముళ్లు' లైట్ తీసుకున్నారు
By: Tupaki Desk | 6 Sep 2019 5:20 AM GMTరాజకీయాల్లో విలువలా? లైట్ తీస్కో అన్న రీతిలో వ్యవహరించినందుకు ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించాల్సిందే. అందుకు ఎంతటి నేతలైనా మినహాయింపు కాదు. రాజకీయాల్లో కొత్త తరహా పోకడలు తీసుకొచ్చి.. అధికారం కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా మారటమే కాదు.. తనకు తగ్గట్లే నేతల్ని మార్చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు సొంతమన్న విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో బాబు రాకతో మొదలైన దరిద్రాలు.. అంతకంతకూ పెరిగాయి. వ్యాపారస్తుల్ని.. పారిశ్రామికవేత్తల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. వారికి పెద్దపీట వేయటం ద్వారా.. రాజకీయాల్ని వ్యాపారంగా చేసిన ఘనత ఆయనదేనన్న విమర్శ ఉంది.
ఒక వ్యాపారస్తుడు రాజకీయ నేత అయినంత మాత్రాన తన స్వభావాన్ని మార్చుకోలేడు కదా? రాజకీయ నాయకుడైతే.. తాను నమ్మిన సిద్ధాంతం.. దానికి తగ్గట్లు నిలబడటం.. పోరాడటం లాంటివి చేస్తారు. కానీ.. వ్యాపారస్తుడికి లాభమే ముఖ్యం. పవరే ప్రాణం. అది లేనంతనే షిఫ్ట్ అయిపోతుంటారు. చేజేతులారా నాయకుల్ని తయారు చేసుకునే దానికంటే సమాజంలో సంపన్నుల్ని తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెట్టిన బాబుకు..జరగాల్సిన శాస్తి జరుగుతుందన్న మాట వినిపిస్తోంది.
ఐదేళ్ల అధికారం తర్వాత.. పవర్ చేజారిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్న వైనం తెలిసిందే. ఎవరి దాకానో ఎందుకు.. బాబుకు కుడిభుజం.. ఎడమ భుజంగా అభివర్ణించే సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లాంటోళ్లే తమ దారి తాము చూసుకుంటున్నప్పుడు మిగిలిన నేతలంతా చెప్పండి.
తాజాగా చంద్రబాబు పార్టీకి బలమైన జిల్లాగా చెప్పే తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన ముఖ్యమైన నేతల్లో ముగ్గురు లైట్ తీసుకొని రాలేదు. పార్టీ అధ్యక్షుడు.. మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవసరమైన టికెట్ కోసం విపరీతంగా తపించి.. బాబు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ముగ్గురు నేతలు.. ముఖం చాటేయటం ఆసక్తికరంగా మారింది.
కాకినాడ.. రాజమండ్రి (రాజమహేంద్రవరం) లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థులగా బరిలోకి దిగిన చలమలశెట్టి సునీల్.. మాగంటి రూపలు తాజా సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. ఇక.. రామచంద్రపురం నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన తోట త్రిమూర్తులు కూడా ముఖం చాటేయటం ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురిలో తోట పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీరే కాకుండా మరికొందరు నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉండటం గమనార్హం.
ఇలాంటి వారిలో కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు.. జిల్లా మహిళ అధ్యక్షురాలు అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్ లతో పాటు తొమ్మిది మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు. ఎన్నికల వేళ కాకినాడ సిటీ ఎమ్మెల్యే సీటును వనమాడి కొండబాబుకు ఇవ్వొద్దన్న వీరంతా.. ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం తర్వాత నుంచి దూరంగా ఉంటున్నారు. మొత్తంగా తాను అనుసరించిన విధానాలే తాజాగా బాబుకు శాపంగా మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది.