Begin typing your search above and press return to search.

లోకేష్‌ ను విమ‌ర్శించినా..టీడీపీ కిక్కురుమ‌నదేం?

By:  Tupaki Desk   |   20 April 2018 11:55 AM GMT
లోకేష్‌ ను విమ‌ర్శించినా..టీడీపీ కిక్కురుమ‌నదేం?
X
రాజ‌కీయ విశ్లేష‌కుల‌నే కాకుండా...సాక్షాత్తు తెలుగుదేశం వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న సంద‌ర్భం ఇది. ఏకంగా పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌రోక్షంగా - యువ‌నేత‌ - మంత్రి లోకేష్‌ ను ప్ర‌త్య‌క్షంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా దుయ్య‌బ‌ట్టిన‌ప్ప‌టికీ...టీడీపీ స్పందించ‌డంక‌పోవ‌డం ఈ ఆశ్చ‌ర్యానికి కార‌ణం. సినీ ప్ర‌ముఖుడు రాంగోపాల్ వర్మ - మంత్రి నారా లోకేష్ - అతని స్నేహితుడు ఇతరులతో కలిసి తనపై కుట్ర చేశారని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ సెక్రటేరియట్‌ ను వేదికగా చేసుకుని తనపై ఆరు నెలలుగా ఈ కుట్ర సాగుతోందని పవన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి - తనపై - తన కుటుంబంపై - తన అభిమానులపై నిరవధికంగా అత్యాచారం జరుపుతున్నారని పవన్ కల్యాణ్‌ తన ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిన్న అంశం అయిన‌ప్ప‌టికీ వెంట‌నే ఘాటుగా రియాక్ట‌య్యే టీడీపీ పెద్ద‌లు - పార్టీ నేత‌లు ఈ ఎపిసోడ్‌పై ఎందుకు కిక్కురుమ‌న‌కుండా ఉన్నార‌నేది ఆస‌క్తిని రేపుతున్న అంశం.

క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎపిసోడ్‌ లో కీలక పాత్రధారి శ్రీరెడ్డి ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తేవ‌డం, ఆ విధంగా చేయ‌మ‌ని చెప్పింది తానేనంటూ వ‌ర్మ ప్ర‌క‌టించుకోవ‌డం తెలిసిందే. మొద‌ట దీన్ని వర్మ - మెగా ఫ్యామిలీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా భావించారు. వర్మ వెనుక ఎవరున్నారంటూ నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన కామెంట్‌…ఆ వెంటనే వర్మ కామెంట్స్ తో ఈ వ్యవహారం చల్లబడిందని అంతా అనుకున‌నారు. కానీ ఉదయాన్నే సవర్ స్టార్‌ తన సంచలన ట్వీట్స్ తో జనాన్ని నిద్రలేపారు! నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ పవన్‌ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌ గా మారిపోయాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడంలో తాను చేసిన కృషికి.. ఇచ్చిన ప్రతిఫలమా అంటూ తన తల్లిపై చేసిన వ్యాఖ్యలను పవన్‌ ప్రస్తావించారు. నారా లోకేష్‌ నేతృత్వంలో ప్లాన్‌ ప్రకారం తనపై, తన ఫ్యామిలీపై దాడి జరుగుతోందని పవన్ ఆరోపించారు. మీడియాపై నేరుగా వ్యాఖ్యలు చేసిన పవర్‌ స్టార్‌… ఈ రాజకీయ పోరాటంలో తాను సమిధ కావడానికి కూడా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ఈ ఇష్యూ హైద‌రాబాద్‌ ఫిలింనగర్‌ నుంచి ఏకంగా అమరావతి వ‌ర‌కు పవర్‌ స్టార్‌ ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చేసిన స‌హాయం, త‌న‌కు ఇప్పుడు ద‌క్కుతున్న గౌర‌వం - పార్టీ అధినేత త‌న‌యుడు త‌న‌పై చేస్తున్న కుట్ర వంటి అంశాల‌ను ప‌వ‌న్ బ‌హిరంగంగానే ఎండ‌గట్టిన‌ప్ప‌టికీ టీడీపీ శిబిరం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డం ఆస‌క్తిని రేకెత్తించిందంటున్నారు. చీమ చిటుక్కుమన్నా..త‌మ‌తో లింక్ పెట్టి స్పందించే టీడీపీ నేత‌లు ఇప్పుడు స్పందించ‌క‌పోవ‌డం వెనుక మ‌ర్మం ఏంటని చ‌ర్చించుకుంటున్నారు. అయితే దీక్ష చేస్తున్న సమయంలో పవన్ ట్వీట్లపై స్పందించొద్దని టీడీపీ అధిష్టానం పార్టీ నేత‌ల‌ను ఆదేశించిందని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్ ట్వీట్లపై స్పందిస్తే దీక్ష పక్కదారి పడుతుందని టీడీపీ భావిస్తున్నట్టు స‌మాచారం.