Begin typing your search above and press return to search.
నాది ఏ గ్రేడే బాసూ.. అలా రాసుకోండి
By: Tupaki Desk | 8 Oct 2016 1:50 PM GMTఎక్కడైతే గుప్పిట మూసి ఉంటుందో.. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. చంద్రబాబునాయుడు సరిగ్గా అక్కడే జనాన్ని గిల్లి వదలిపెట్టారు. ఎమ్మెల్యేలు అందరికీ ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన తరువాత.. అందులో ఏం ఉన్నదో ఎవ్వరికీ చెప్పవద్దని - టాప్ సీక్రెట్ గా వాటిని మెయింటైన్ చేయాలని ఒక డైలాగు వేయడం ద్వారా.. చంద్రబాబునాయుడు.. రాష్ట్ర ప్రజల్లో ఒక ఆసక్తికి బీజం వేశారు. మన ఎమ్మెల్యేకు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవాలనే ముచ్చట జనాల్లో ఉంటుంది కదా. వారికంటె ముందు మీడియా మిత్రులకు కూడా ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ తమ తమ నియోజకవర్గాల్లో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. లోకల్ రిపోర్టర్లంతా ఎమ్మెల్యేలను కలిసి.. 'ఎవరికీ చెప్పంలేగానీ.. మీ గ్రేడ్ ఏంటి సార్.. మీకిచ్చిన సీల్డ్ కవర్లో ఏముందిసార్' అంటూ ఆరాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక ఎడ్వాంటేజీ తీసుకుంటున్నారట. తమ లోకల్ రిపోర్టర్లు ఇలా గ్రేడింగ్ గురించి అడిగినప్పుడు.. మనం ఇక్కడ యిరగదీస్తున్నాం కదా.. మనకు ఏ గ్రేడే వచ్చింది బాసూ.. అందులో డౌటేముంది అని చెప్పేసి తప్పించుకుంటున్నారట. నిజానికి చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరును నాలుగు రకాల గ్రేడ్ లుగా విభజించినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఏ నుంచి డి వరకు గ్రేడ్ లు ఉంటాయన్నమాట. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఎవరికి వారు తమది ఏ గ్రేడే అని చెప్పుకుంటున్నారట. ఎటూ సీల్డ్ కవర్ ను చూపించే బాధ లేదు కాబట్టి.. ఆ విషయం చంద్రబాబు మీద నెట్టేసి.. డి గ్రేడ్ లో నిలిచిన వాళ్లు కూడా ఏ అంటూ గప్పాలు కొట్టుకుంటున్నారని పార్టీ ఆఫీసులో చెవులు కొరుక్కుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/