Begin typing your search above and press return to search.
'పవర్ 'ట్వీట్స్...'పచ్చ'డి పీక్స్
By: Tupaki Desk | 21 April 2018 9:59 AM GMT ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టు తేదేపా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరో బట్టలిప్పడం ఏమిటి? ఈయనొచ్చి మా బట్టలిప్పడం మొదలెట్టాడేమిటి? అంటూ బెంబేలెత్తుతున్నారు. గురువారం రాత్రి తాపీగా మొదలైన ట్వీట్లు చినికి చినికి గాలివానగా మారి తెలుగుదేశం పార్టీని ఎత్తి పడేస్తున్నాయి.
తొలుత శ్రీరెడ్డి ఇష్యూతో మొదలైన వ్యవహారం రింగ్ రోడ్ లాగా మలుపులు మలుపులు తిరిగి తిరిగి ఇప్పుడు తేదేపా-ఓ వర్గం మీడియా వర్సెస్ పవన్ కళ్యాణ్ దగ్గర ఆగింది. మీడియా చానళ్ల సాక్షిగా తనపై కుట్ర జరిగిందంటూ పవన్ ఆరోపించడం, దీనిపై ధర్నాకు దిగడం... పైగా ఇక నేను దీన్ని తెగేదాకా లాగుతానంటూ తేల్చి చెప్పేయడం దానికి తగ్గట్టే ఆయన వరుసగా ట్వీట్లు సంధించదం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతున్నాయి.
నిజానికి పవన్ కు ట్వీట్లు కొత్త కాదు. ట్వీట్ల ద్వారా పాప్యులరైన ఈ సినిమా-పొలిటికల్ హీరో... రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన ప్రస్తుత కీలక సమయంలో తనకు అచ్చొచ్చిన మార్గాన్నే యుద్ధానికి ఎంచుకున్నట్టు కనపడుతోంది. ఆయన ట్వీట్లు కూడా సినిమా టీజర్ల తరహాలో ఉండడం విశేషం.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ అజ్ఞాత వాసిని బ్లాక్ మెయిలర్ అని ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రితో అన్నారని ఒకరితో అన్నారు ఆ మంత్రి ఎవరు? మఖ్యమంత్రి ఎవరు? ఆ ఒకరు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. అసలైన అజ్ఞాత వాసి ఎవరో తెలుసా? అంటూ ఈ సినిమా అజ్ఞాత వాసి తానే స్వయంగా శనివారం ఉదయం ట్వీట్ చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాదు... ఫ్యాక్షనిస్టుల ఆస్తులు ప్రభుత్వం జప్తు చేయాలంటూ టీవీ9 చానెల్ లో చాలా కాలంగా ఇస్తున్న నినాదం గురించి కూడా ఆయన ట్వీట్ లో ప్రస్తావించాడు. ఇది ఎవరిని ఉద్ధేశ్యించో తెలుసా? అంటూ కొత్త సందేహాలు రేకెత్తించాడు. నిజాలని నిగ్గు తేలుద్దాం - బట్టలిప్పి మాట్లాడుకుందాం అంటూ... పవన్ చేస్తున్న ట్వీట్స్... తేదేపా గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.
మరోవైపు ఈ గోలలో కాస్టింగ్ కౌచ్ - సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ - కాష్ కమిటీ వగైరాలన్నీ ఎటు కొట్టుకుపోతాయో వేచి చూడాలి.