Begin typing your search above and press return to search.
తమ్ముళ్ల ఫీలింగ్స్ బాబుకు పట్టటం లేదా?
By: Tupaki Desk | 29 April 2016 4:54 AM GMTఏపీ తమ్ముళ్లు హర్ట్ అవుతున్నారా? అధినేత వైఖరి మీద వారు గుర్రుగా ఉన్నారా? టైం చూసుకొని తమ మాటను ఏ మాత్రం వినని తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? లాంటి ప్రశ్నలు తాజాగా వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని కొందరు చాలా సింఫుల్ గా తీసి పారేస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నరు. ఈ రెండురకాల వాదనల మాటెలా ఉన్నా.. ఒక మాట మాత్రం అందరి నోటి నుంచి కామన్ గా వినిపిస్తుంది. అదేమంటే.. గతంలో మాదిరి చంద్రబాబు ఎవరి మాటల్ని పరిగణలోకి తీసుకోవటం లేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీలోకి వస్తున్న నేతలపై పలువురుకి పలు అభిప్రాయాలు ఉన్నా.. వేటిని పరిగణలోకి తీసుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది.
కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి ఎంట్రీకి రామసుబ్బారెడ్డి అస్సలు ఇష్టపడకున్నా..కర్నూలు జిల్లాలో భూమాను శిల్పా వర్గం ససేమిరా అన్నా.. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి చేరికను కరణం అస్సలు కాదన్నా.. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని నో అని గంటా.. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు పార్టీలో చేరే మాజీ మంత్రి గాదెను స్థానిక నేతలు వద్దని చెబుతున్నా బాబు మాత్రం వినటం లేదన్న మాట చెబుతున్నారు. ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. ఇలాంటి ఉదాహరణలు జిల్లాల వారీగా చాలానే ఉన్నాయని చెప్పాలి.
గతంలో బాబు తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకించే వారిని తన మాటలతో బుజ్జగించటంతో పాటు.. కొన్ని సందర్భాల్లో నేతలు ఇచ్చిన సలహాల్ని.. సూచనల్ని అమలు చేసే వారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో నిశ్చితాభిప్రాయంలో ఉన్న చంద్రబాబు.. ఏపీ విపక్ష నేతను కూకటివేళ్లతో సహా దెబ్బ తీయాలన్న ఆలోచన బాబుకు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో బలమైన నేతలు ఎవరైనా టీడీపీ గొడుకు కిందకు తీసుకురావటం ద్వారా.. 2019 ఎన్నికల నాటికి తనకు మించిన ప్రత్యామ్నాయం ఉండకుండా చేయటంతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంలో పూర్తిగా బలహీనం చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
ఈ వ్యూహంలో భాగమే మాజీలకు సైతం పెద్దపీట వేస్తూ.. తానే స్వయంగా ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు. అయితే.. ఈ చేరికల విషయంలో తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. వారి ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా వారిని బుజ్జగిస్తున్న చంద్రబాబు.. చేరికల్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆపకపోవటం గమనార్హం. ఆపరేషన్ ఆకర్ష్ ఎపిసోడ్ లో చంద్రబాబు తీరుతో తమ్ముళ్లు హర్ట్ అవుతున్నారన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. మరి.. తమ్ముళ్ల ఆగ్రహజ్వాల సమిసిపోయేలా చంద్రబాబు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.