Begin typing your search above and press return to search.
లోకేశ్ బ్లాక్ మెయిలింగ్ పై టీడీపీలో అసంతృప్తి
By: Tupaki Desk | 19 Feb 2017 5:30 PM GMTచంద్రబాబు సమావేశాలంటే అధికారులు జడుసుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా తెలుగు తమ్ముళ్లు కూడా చంద్రబాబు మీటింగులంటే మొహం మాడ్చేస్తున్నారట. అదే పనిగా ఆయన క్లాసులు పీకుతుండడంతో నేతలు తెగ ఇబ్బంది పడుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఇటీవల కాలంలో ప్రీబడ్జెట్ పేరిట మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకరోజంతా విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో ఆయన కనిపించిన ప్రతి ఒక్కరికీ క్లాసు పీకారు. అంతేకాదు.. చెప్పిందే చెబుతూ వారికి తెగ విసుగు తెప్పించారు. ‘‘మీ పనితీరు మెరుగుపరచుకోండి.. ప్రతిపక్షం ఎదురు దాడి చేస్తుంది.. మీడియాతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ పదేపదే సుద్దులు చెబుతుండడంతో వారు చికాకు పడుతున్నారు.
నియోజకవర్గాల్లో పరిస్థితులు… వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికే ఈ కసరత్తు అని చంద్రబాబు చెబుతున్నా ఆయన చెప్పే విధానం మాత్రం నేతలకు నచ్చడం లేదట. స్కూళ్లో హెడ్ మాష్టర్ లా చంద్రబాబు అందరినీ అదిలిస్తున్నారని.. మరునాడు మీడియాలో వారికి క్లాసు, వీరికి క్లాసు అంటే తమ నియోజకవర్గాల్లో పరువుపోతోందని వారు ఆవేదన చెందుతున్నారు.
పోనీ చంద్రబాబు అంటే సరేసరి.. లోకేశ్ కూడా తమకు నీతులు చెబుతున్నారని.. తమ రాజకీయ అనుభవం ముందు ఆయనెంతని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కాస్త కఠవుగా మాట్లాడినా అందులో సూచనలు ఉంటున్నాయని.. కానీ, లోకేశ్ మాత్రం మీపై ఈఈ ఆరోపణలు ఉన్నాయంటూ పదవులు, సీట్లు గ్యారంటీ లేదని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/