Begin typing your search above and press return to search.
బాబు ర్యాంకుల మీద తమ్ముళ్ల ఆక్రోశం
By: Tupaki Desk | 19 April 2016 4:11 AM GMTఏపీ సర్కారులో ర్యాంకులపై భారీ చర్చే నడుస్తోంది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పార్టీ కోసం పని చేస్తున్న నేతల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించిన వైనం ఇప్పుడు కలకలంగా మారింది. అనధికారికంగా విడుదలైన ఈ జాబితాను చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అదే సమయంలో పుట్టెడు లోపాలున్నట్లుగా టీడీపీ నేతలు లోగుట్టుగా విమర్శలు చేయటం గమనార్హం. 19 మంత్రులకు సంబంధించిన ర్యాంకులు బయటకు వచ్చాయి. అయితే.. పార్టీ తరఫున ఈ మదింపు జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనిపై తెలుగుదేశంనేతలు వేస్తున్న ఒక ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అదేమంటే.. పార్టీ పరంగా ర్యాంకుల లెక్క తీస్తే.. ఆ జాబితాలో బీజేపీకి చెందిన మంత్రులకు ర్యాంకులు ఎలా కేటాయించారన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. పది అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకుల్ని కేటాయించినట్లుగా తెలిసింది. ఆయా మంత్రుల పర్యటనలు.. వారు నిర్వహించిన మీడియా సమావేశాల్లాంటి పది అంశాల్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకుల్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది.
దీనిపై పలువురు తమ్ముళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పని తీరు ఆధారంగా మదింపు చేయాలే తప్పించి కొన్ని అసమగ్ర అంశాల్ని లెక్కలోకి తీసుకొని ర్యాంకులు ఎలా డిసైడ్ చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ ర్యాంకుల మీద ఆసక్తికర విమర్శ కూడా ఒకటి బలంగా వినిపిస్తోంది. ర్యాంకుల్లో టాప్ ర్యాంకు పొందిన నేతలకు కేటాయించిన శాఖలన్నీ అంత ఛరిష్మా లేనివి కాకపోవటం గమనార్హం.
మరో అంశం ఏమిటంటే.. బాబుకు అత్యంత దగ్గరైన నేతల ర్యాంకులు అట్టడుగులో ఉండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మంత్రి నారాయణ చొరవను ప్రత్యేకంగా చెప్పాల్సిందే. అయితే.. ఆయన ఏకంగా 18వ స్థానంలో నిలవటం గమనార్హం. అయితే.. నారాయణ మాత్రం తన ర్యాంకు ఆరుగా చెబుతున్నారు. ఇక.. ఏపీ సర్కారులో కీలకపాత్ర పోషించే ఆర్థిక మంత్రి రామకృష్ణుడు పేరు ర్యాంకుల జాబితాలో కనిపించకపోవటం విశేషంగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా నేతల ర్యాంకులు ఉన్నాయే తప్పించి.. ఈ ఎంపికలో శాస్త్రీయత అస్సలు లేదని తమ్ముళ్లు చెబుతున్నారు. బాబు లాంటి నేత ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు మంత్రులకు ర్యాంకులు ఇవ్వాలని డిసైడ్ అయితే అదంతా పక్కాగా ఉండాలే కానీ.. ఇన్నేసి విమర్శలు వెల్లువెత్తేలా ప్రయత్నం ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.