Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ టూర్ అంటేనే... టీడీపీ వ‌ణికిపోతోందిగా!

By:  Tupaki Desk   |   2 Feb 2017 9:30 AM GMT
జ‌గ‌న్ టూర్ అంటేనే... టీడీపీ వ‌ణికిపోతోందిగా!
X
నిజ‌మే... విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న అంటేనే... అధికార పార్టీ టీడీపీ హ‌డ‌లెత్తిపోతోంది. అస‌లు జ‌గ‌న్ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతంలో ప‌ర్య‌టించ‌కూడద‌ని, అలా ప‌ర్య‌టిస్తే... తాము చేస్తున్న అభివృద్ధికి బ్రేకులు ప‌డిన‌ట్లుగానే టీడీపీ నేత‌లు భావిస్తున్న‌ట్లుగా ఉంది. అయితే విప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్‌... ఇంటిప‌ట్టున్న కూర్చునే ర‌కం కాదుగా. జ‌నం అధికారం క‌ట్ట‌బెట్ట‌కున్నా... త‌న‌కిచ్చిన విప‌క్ష నేత హోదాకు న్యాయం చేయాల‌న్న భావ‌న‌తో ఆయ‌న ప్ర‌తి అంశంపైనా ప్ర‌భుత్వాన్ని త‌ప్పిదాల‌ను నిల‌దీస్తూ రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌ లో విద్యార్థి లోకం నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన శాంతి ర్యాలీకి కూడా వెళ్లేందుకు ఆయ‌న య‌త్నించారు. అయితే విశాఖ‌లో అడుగుపెట్టిన జ‌గ‌న్‌ ను... టీడీపీ ప్ర‌భుత్వం ఏ రీతిన ఎయిర్ పోర్టు దాట‌కుండా చూసిందో మ‌నంద‌రం చూసిందే.

తాజాగా ఈ నెల 6న అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజక‌వ‌ర్గంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - విప‌క్షాల‌పై త‌న‌దైన శైలిలో వాగ్ధాటి ప్ర‌ద‌ర్శించే ఆ పార్టీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌ కు చెందిన ఆ నియోజ‌కవ‌ర్గంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటేనే... ఆస‌క్తి క‌లిగించేదే. రాయ‌ల‌సీమ జిల్లాల‌ను స‌శ్య‌శ్యామలం చేసేందుకు ఉద్దేశించిన హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌థ‌కం ప‌రిశీల‌న కోస‌మే జ‌గ‌న్ అక్క‌డికి వెళుతున్న‌ట్లు స‌మాచారం. జిల్లాలో మెజారిటీ స్థానాలు టీడీపీ ఖాతాలో చేరినా... ప‌య్యావుల‌కు షాకిస్తూ ఉర‌వ‌కొండ వాసులు వైసీపీ నేత‌గా బ‌రిలోకి దిగిన విశ్వేశ్వ‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. వ్య‌వ‌సాయం - సాగునీటి రంగాల‌పై అపార అనుభవం ఉన్న విశ్వేశ్వ‌ర‌రెడ్డి... టీడీపీ స‌ర్కారు చేప‌డుతున్న ప‌లు ప‌థ‌కాల్లోని అవినీతి - అక్ర‌మాలు - తీవ్ర జాప్యంపై ఎప్ప‌టిక‌ప్పుడు ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు.

ఈ క్ర‌మంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న హంద్రీ- నీవా ప‌నుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాన్ని ఆయ‌న జ‌గ‌న్ ముందు పెట్టిన‌ట్లు స‌మాచారం. దీంతో ప్ర‌భుత్వ ద‌మ‌న నీతిని ఉర‌వ‌కొండ వేదిక‌గానే ఎండ‌గ‌ట్టేందుకే జ‌గ‌న్ ఈ నెల 6న అక్క‌డ‌కు వెళుతున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో ఒక్క‌సారిగా అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంద‌నే చెప్పాలి. గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ కూడా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై కాస్తంత ప్ర‌త్యేక దృష్టి సారించింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం టీడీపీ నేత‌, ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే సూర్య‌నారాయ‌ణ మీడియా ముందుకు వ‌చ్చి త‌న‌దైన శైలి వాద‌న‌ను వినిపించారు. అస‌లు ఉర‌వ‌కొండ‌లో జ‌గ‌న్ ప‌ర్య‌టించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న... ఉర‌వ‌కొండ‌లో జ‌గ‌న్ ఎందుకు స‌భ పెడుతున్నార‌ని కూడా ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ఉనికిని కోల్పోయార‌ని, అస‌లు జ‌గ‌న్ ఏం చేస్తున్నారో ఆయ‌న‌కే తెలియని ప‌రిస్థితిలో ఉన్నార‌ని కూడా విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్య‌లతోనే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటే... టీడీపీ నేత‌లు హ‌డ‌లిపోతున్న‌ట్లుగా సూర్య‌నారాయ‌ణ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/