Begin typing your search above and press return to search.
లక్ష్మీస్ ఎన్టీఆర్: తమ్ముళ్లు భయపడుతున్నారా?
By: Tupaki Desk | 27 Sep 2017 8:33 AM GMTవర్మ తెరకెక్కిస్తున్న మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్! దీనిపై అంచనాలు చాలా భిన్నంగా ఉన్నాయి. మొన్నామధ్య వంగవీటి తీసి రచ్చరచ్చ సృష్టించిన వర్మ.. తాజా ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎంచుకున్నారు. అయితే, ఈ పరిణామం ఏపీ అధికార పార్టీ టీడీపీ తమ్ముళ్లు సహా అధినేత చంద్రబాబు గుండెల్లో గునపాలు దించుతోంది! ఆనాటి ప్రతి దృశ్యాన్ని నిజాయితీగా వర్మ తెరకెక్కిస్తే.. నాడు చివరి దశలో అన్నగారుగా తెలుగు ప్రజలు ఇంటికో గుడికట్టి కొలుచుకున్న నటసార్వభౌముడు కన్నీటి పర్యంతమయ్యాడు. జామాతా దశమగ్రహం అంటూ మీడియాకు మొరపెట్టుకున్నారు.
అదేవిధంగా అందరి మధ్యా లక్ష్మీపార్వతి మెడలో మూడు ముళ్లు వేశారు. అదేసమయం వైశ్రాయ్ హోటల్ వేదికగా ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు రువ్వించారు. ఈ సన్నివేశాలన్నీ.. వెండితెరకెక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పరిణామమే టీడీపీ నేతలకు కంటిపై కునుకు పట్టనివ్వడం లేదు. వెన్నుపోటు లేకుండా - టీడీపీని చంద్రబాబు లాగేసుకున్న వైనాన్ని చూపించకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కితే.. ఉప్పులేనిపప్పే! కాబట్టి.. వర్మ ఈ విషయంలో తన జాగ్రత్తలు తాను తీసుకుని ఎంత వివాదస్పదమైనా ముందుకే వెళ్తారనడంలో ఎలాంటి సందేహమూలేదు.
అయితే, ఈ పరిమాణం టీడీపీ గొంతులో చేపముల్లులా మారింది. 2019 ఎన్నికల వేళకు ఈ మూవీ కనుక రిలీజ్ అయితే, తమ పరిస్థితి ఏంటని నేతలు తమలో తామే తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్.. మీడియా ముఖంగా వర్మను ఏకేశాడు. అన్నగారిపై మూవీ తీస్తే.. తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టనివ్వనని హెచ్చరించాడు. అయితే, వర్మ కూడా సేమ్ టుసేమ్ రియాక్ట్ అయ్యాడు. నీయబ్బ అంటూ రెచ్చిపోయాడు. అయితే, ఎవరు ఏమనుకున్నా.. ఈ మూవీ మాత్రం భారీస్థాయిలో బాబుపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. ఎంత కప్పుకొన్నా పుట్టుమచ్చ దాగనట్టే.. బాబుకు మామగారి పాపం వెంటాడుతూనే ఉంటుందన్న ఓ వ్యాసకర్త అభిప్రాయం నిజమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.