Begin typing your search above and press return to search.
మండలిలో బిల్లును టీడీపీ అడ్డుకుంటే ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 20 Jan 2020 2:53 AM GMTఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు కు సంబంధించిన బిల్లును తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.
అయితే అమరావతి నుంచి రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీని శాసన మండలిలో బలం ఉండడంతో అడ్డుకోవడానికి వ్యూహరచన చేస్తోంది.
శాసన మండలిలో వైసీపీకి బలం లేదు. టీడీపీకి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఏపీకి 3 రాజధానుల బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడానికి రెడీ అయ్యింది.
అయితే వాస్తవంలో మండలిలో బిల్లును తిప్పికొట్టినా కూడా టీడీపీ ఈ రాజధానుల బిల్లును అడ్డుకోలేదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మండలిలో ఈ రాజధానుల బిల్లును తిరస్కరించినా.. సవరణలు ప్రతిపాదించినా.. 3 నెలలు ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. తిరిగి శాసనసభకు వస్తుంది. అసెంబ్లీ గతంలో పాస్ చేసిన బిల్లును మళ్లీ పాస్ చేసి చట్టంగా మార్చే హక్కు శాసనసభకు ఉంటుంది. శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో 3 రాజధానుల బిల్లు చట్టం రూపు దాల్చడం ఖాయం. అయితే కొంత ఆలస్యం కావచ్చు తప్పితే శాసనమండలిలో టీడీపీ ఈ 3 రాజధానులను అడ్డుకోవడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
ఇలా సాంకేతిక కారణాలతో మూడు నెలల వరకూ మాత్రమే టీడీపీ అడ్డుకోగలదు. కానీ బిల్లును తిరస్కరించే అధికారం మాత్రం టీడీపీకి ఉండదని తేలింది.