Begin typing your search above and press return to search.
తమ్ముళ్లు.. సీబీఐ విచారణకు ఆదేశించొచ్చుగా?
By: Tupaki Desk | 15 March 2018 7:01 AM GMTడామిట్.. కథ అడ్డం తిరిగింది. నాలుగేళ్లుగా కామ్ గా ఉన్న పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడటం సంచలనంగా మారింది. అనుభవానికి పెద్దపీట వేస్తూ బాబులాంటోడు సీఎం కుర్చీలో ఉంటే బాగుంటుందన్న మాటను పవన్ పలుమార్లు ప్రస్తావించారు. అలాంటి పవన్ ఈసారి అందుకు భిన్నంగా విరుచుకుపడటమే కాదు.. చంద్రబాబు కుమారుడు కమ్ ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
చంద్రబాబు మొదలు తెలుగు తమ్ముళ్లంతా ఇప్పుడు లోకేశ్ పై పవన్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతున్నారు. పవన్ వేసిన మరకను తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతా బాగుంది కానీ..పవన్ వేసిన ఆరోపణ మరకపై ఆగమాగం అయ్యే కన్నా.. తమ చిన్న బాస్ సుద్దపూస అని.. విలువలకు ప్రతిరూపమన్నట్లుగా మాట్లాడుతున్న తెలుగు తమ్ముళ్లు మరో అడుగు ముందుకేసి.. లోకేశ్ పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తే బాగుంటుంది కదా?
ఎవరో అడిగే దాని కంటే ముందే.. లోకేశే మీద పవన్ చేసిన ఆరోపణలకు తమకు తాముగా స్పందించి సీబీఐ విచారణ కోరితే అదిరిపోతుందిగా.?
ఇదే కానీ చేస్తే.. పవన్ చేసిన ఆరోపణల తీవ్రత తగ్గటంతో పాటు.. చినబాబు ఇమేజ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మరెవరూ చినబాబు మీద తొందరపడి ఒక మాట అనే ప్రయత్నం చేయరు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం.. పవన్ వేసిన మరకల్ని వీలైనంత త్వరగా తుడిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి.. తమ యువ నాయకుడిపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ చేయాలంటూ డిమాండ్ చేసేంత దమ్ము ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.