Begin typing your search above and press return to search.
గోదావరిలో ముసలం2 : బంధానికి గొడ్డలి దెబ్బ!
By: Tupaki Desk | 13 Feb 2018 3:30 PM GMTఇది ఒకటో దెబ్బ కాదు. రెండో దెబ్బ! తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీల మధ ఉండే మైత్రీ బంధానికి ఇది రెండో గొడ్డలి దెబ్బ! క్రమక్రమంగా బలహీన పడుతున్న బంధానికి ఇది మరో కుదుపు. కాకపోతే.. రెండు గొడ్డలి దెబ్బలు కూడా గోదావరి జిల్లాలోనే పడడం గమనార్హం. భాజపాకు చెందిన ఎంపీ గోకరాజు గంగరాజు కు తెలుగుదేశం స్థానిక నాయకులు ఒక రేంజిలో కాక పుట్టించారు. ఆయన వారిని కసురుకుని - విసురుకుని.. నా కార్యక్రమానికి ‘మీరు రాకుంటే పొండి’ అంటూ విదిలించుకుని వెళ్లిపోయే వరకు పరిస్థితి వచ్చింది.
గోకరాజు గంగరాజు తన ఎంపీ లాడ్స్ నిదులతో నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు షెడ్యూలు పెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశానికి చెందిన పులవర్తి రామాంజనేయులుతో కలిసి ఆయన బయల్దేరారు. పశ్చిమగోదావరి జిల్లాలో వీరవాసరం మండలానికి చేరుకునే సరికి ఆయనకు తెలుగుదేశం నాయకులనుంచి ప్రతిఘటన ఎదురైంది.
దాదాపు వంద మంద తెలుగుదేశం నాయకులు కలిసి కట్టుగా ఎంపీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. స్థానిక నాయకులు సాధారణంగా.. స్థానిక సమస్యలమీదనే వినతులు ఇస్తారని ఊహించిన ఎంపీ గంగరాజు ఖంగు తినాల్సి వచ్చింది. ‘ప్రత్యేకహోదా ఇస్తాం అని మోడీ తిరుపతిలో హామీ ఇచ్చారు. మాట తప్పారు.. రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు.. ’ అంటూ ఈ విషయాలన్నిటినీ ఏకరవు పెడుతూ తెదేపా మండల నాయకులు.. గోకరాజును నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. అసలు కేంద్రం ఏం ఇచ్చిందో మీకు తెలుసా? ముందు అది తెలుసుకుని రండి.. అంటూ మండిపడ్డారు. కానీ తెదేపా నాయకులు కూడా అక్కడితో వదల్లేదు.. ‘పోనీ కేంద్రం ఏం ఇచ్చిందో మీరే చెప్పండి తెలుసుకుంటాం’ అంటూ వాదనకు దిగారు. ఎంపీగారి దగ్గర సమాధానం లేదో ఏమో తెలియదు గానీ.. వారి మీద చిర్రుబుర్రులాడుతూ వెళ్లిపోయారు.
మీ కార్యక్రమానికి మేం రాం అని అనేసరికి రాకపోతే పొండి అంటూ విసుక్కుని వెళ్లిపోవడం విశేషం. గోదావరి జిల్లాలో భాజపా- తెదేపాల మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా కయ్యాలు జరుగుతుండడం ఇద తొలిసారి కాదు. రాష్ట్ర భాజపా మంత్రి పైడికొండ మాణిక్యాల రావు కు కూడా తెలుగుదేశం వారితో చేదు అనుభవాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో... పార్టీల మధ్య ముందు ముందు బంధం ఎలా ఉండబోతున్నదనడానికి ఇలాంటి వ్యవహారాలు సంకేతాలు అని పలువురు విశ్లేషిస్తున్నారు.