Begin typing your search above and press return to search.
టీడీపీ నేత అరగుండు...అర్దనగ్న ప్రదర్శన!
By: Tupaki Desk | 5 Jan 2017 5:50 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మొదలుపెట్టిన జన్మభూమి సమావేశాలు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి వేదికగా మారుతున్నాయి. సమస్యలు పరిష్కరించడం లేదంటూ అరగుండుతో నిరసనలు తెలపడం - అధికారులను ప్రశ్నించడం వంటివి సాధారణంగా మారాయి. అదే సమయంలో తమను నిలదీయడం జీర్ణించుకోలేని తెలుగుతమ్ముళ్లు వాదోపవాదాలకు దిగుతుండటంతో గొడవలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జన్మభూమి సభలు సమస్యల నెలవులుగా మారాయి. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించకపోవడంపై అధికారులు - ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. సమ స్యలను పరిష్కరించని సభలు ఎందుకని జన్మభూమి కమిటీ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారని , ఆ కమిటీలనే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మహిళలు ముగ్గులు వేసి నిరసన తెలుపగా.. కొందరు యువకులు అర గుండు - అరమీసం గీయుంచుకుని తమ అసమ్మతిని వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రహ్లాద అరగుండు-అర మీసం గీయించుకుని నిరసన తెలిపారు. ఇంకొందరు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామంలో నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరు పేదలకు గృహాలు - పింఛన్లు అందడం లేదని ఎంపిటిసి రాజ్యలక్ష్మి భర్త రాఘవేంద్ర అధికారుల దృష్టికి తెచ్చారు. ఇంతలో టీడీపీ నేత బోయ ప్రతాప్ జోక్యం చేసుకొని ఆయనపై కుర్చీతో దాడి చేశాడు. రాఘవేంద్ర తమ్ముడు నాగరాజు కర్రతో ప్రతాప్ పై దాడి చేయడంతో తలకు గాయమైంది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లాలో గ్రామ సభ రసాభాసగా సాగింది. చీరాల మండలం గవిని వారిపాలెంలో ఎమ్మెల్యే వచ్చాక ఆలస్యంగా ప్రారంభించారు. ఎంపీపీ గవిని శ్రీనివాసరావు - జెడ్పీటిసి అరుణను వేదిక మీదకు పిలవకపోవడంతో వారు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. రెండు పక్షాల నినాదాలతో సభలో ఘర్షణ చెలరేగింది. చివరకు పోలీసులు ఎంపీపీ - జెడ్పీటిసిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ నిర్వహణ కమీషన్ ఇవ్వకపోవడంపై సరుబుజ్జిలి మండలం యరగాం గ్రామ సభలో డ్వాక్రా మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.రెండు లక్షల బకాయిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. 207 ఎకరాల మిగులు భూమికి పరిహారం చెల్లించాలని, యూత్ ప్యాకేజీలు ఇవ్వాలని తహశీల్దారును వంశధార నిర్వాసితులు నిలదీశారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనందుకు నిరసనగా ఆ సామాజిక తరగతి ప్రజలు కవిటి మండలం వరక గ్రామసభను అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో అర్హులకు పింఛన్లు మంజూరు చేసి ఇవ్వడం లేదని సర్పంచ్ ఆధ్వర్యాన జన్మభూమి సభను బహిష్కరించారు. జి.మర్రివలసలో రుణమాఫీ పై రైతులు అధికారులను నిలదీశారు. తిత్తిరి పంచాయతీలో సమస్యలపై అధికార పార్టీకి చెందిన వారే అధికారులను నిలదీశారు. విశాఖ జిల్లాలో పింఛన్ల మంజూరులో వివక్ష చూపుతున్నారంటూ సర్పంచి కాద సూర్యనారాయణతో పాటు స్థానికులు జన్మభూమి సభలో అధి కారులను నిలదీశారు. టీడీపీ ఎంపీపీ - వైసీపీ సర్పంచికి మధ్య వాగ్వాదం జరిగింది. కృష్ణా జిల్లాలో గుడివాడ మండలం బిళ్లపాడులో స్థానికంగా రోడ్లు వేయాలని కోరినవారిపై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. ఫ్రశ్నించడమే తప్పన్నంటు దౌర్జన్యం చేయడంతో స్థానిక మహిళలు ఎదురుతిరిగి టిడిపి నాయకులను నెట్టివేశారు. ఇళ్లు ఎందుకు నిర్మించటం లేదంటూ స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. చిన్నపిల్లలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళలు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లాలో సమస్యలపై సీపీఎం నాయకులు - ప్రజలు అధికారులను నిలదీశారు. శ్మశాన - పాఠశాల - పారిశుధ్యం - దోమల సమస్యల పై ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/