Begin typing your search above and press return to search.
బాబును ‘‘సీఎం’’ అనటం మానేసిన తమ్ముళ్లు
By: Tupaki Desk | 21 Dec 2015 3:57 AM GMTనమ్మరు కాని ఇది నిజం. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబును ‘సీఎం’ బాబు అనటం మానేశారు తమ్ముళ్లు. తాము అమితంగా అభిమానించి.. ఆరాధించే బాబును సీఎం అనలేకపోవటానికి వారు విపరీతంగా వేదన గురి చేస్తుంది. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తర్వాత కానీ దక్కని ‘సీఎం’ పదవిని.. నోరారా పిలిచేందుకు సైతం వెనుకాడుతున్నారు. నిజానికి.. దీనికో సమంజసమైన కారణం ఉంది. ఇటీవల వెలుగు చూసిన ‘కాల్ మనీ’ వ్యవహారాన్ని కృష్ణా జిల్లా వాసులు కాల్ మనీ వ్యాపారం చేసే వారిని ‘సీఎం’గా సంబోధిస్తున్న దుస్థితి. దీంతో.. తమ అధినేత చంద్రబాబును సీఎం అనటం మానేశారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అని కానీ.. లేదంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు అని వారు పూర్తిగా పలుకుతున్నారు. కాల్ మనీ వ్యాపారం చేసే వారిని ఈజీగా గుర్తించేందుకు వారి పేరు మొదట సీఎం అన్న అక్షరాల్ని కలపటంతో.. ఇంతకాలంగా ఉన్న సీఎం పేరుకు కొత్త కళంకం అంటుకుంది. దీంతో.. తమ చంద్రబాబును ‘సీఎం’ అని వ్యవహరించేందుకు తమ్ముళ్లు సందేహపడుతున్నారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని మిగిలిన ప్రాంతాలు భావిస్తుంటే.. కృష్ణా జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా కాల్ మనీగా వ్యవహరించటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సో.. చంద్రబాబును అయితే ముఖ్యమంత్రి అన్న పదాన్ని కానీ.. చీఫ్ మినిస్టర్ అని మాత్రమే పిలవండి తప్పించి.. సీఎం అని మాట వరసకు కూడా బాబును అనొద్దంటూ కృష్ణా జిల్లా నేతలు చెబుతుండటం గమనార్హం.కాల్ మనీ యవ్వారం తెలుగు తమ్ముళ్లకు ఎన్ని తిప్పలు తీసుకొచ్చిందో కదూ.