Begin typing your search above and press return to search.
టీడీపీ సక్సెస్ అయ్యిందా ?
By: Tupaki Desk | 20 Oct 2021 5:31 AM GMTఅధికార వైసీపీని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు ఓ వ్యూహం ప్రకారమే రెచ్చగొడుతున్నట్లుంది. లేకపోతే పదే పదే ఒకే అంశంపై జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలతో బురదచల్లాల్సిన అవసరమే లేదు. జగన్ను పట్టుకుని టీడీపీ అధికారప్రతినిధి పబ్బాభి నోటికొచ్చినట్లు మాట్లాడారు. డైరెక్టుగా చెప్పాలంటే సీఎంను పట్టుకుని పట్టాభి బోసిడిక్కే అని రేయ్ అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. పట్టాభి మాట్లాడిన విధానం చూస్తే కావాలనే అలా మాట్లాడినట్లు అర్ధమైపోతోంది.
జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడితే తమపై వైసీపీ నేతలు కచ్చితంగా దాడులు చేస్తారని తెలియనంత అమాయకులు కాదు టీడీపీ నేతలు. ప్రభుత్వంపై విధానపరమైన విమర్శలు చేయటంలో తప్పే లేదు. జగన్ పై ఆరోపణలు కూడా చేయవచ్చు. కానీ తాము చేసే ఆరోపణలు లాజిక్కు నిలబడాలి. అంతేకానీ ఏది పడితే అది మాట్లాడేస్తూ డైరెక్టుగా జగన్ను అరే అని ఒరేయ్ అని బోసిడీకే అన్న తర్వాత వైసీపీ నేతలు ఊరికే ఉంటారని ఎవరైనా ఎలా అనుకుంటారు ?
తాము జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడితే తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తారని ఊహించారు. అందుకనే వైసీపీ నేతలను రెచ్చగొట్టాలని కావాలనే వ్యూహం ప్రకారమే పట్టాభి నోటికి పనిచెప్పారు. వాళ్ళు అనుకున్నట్లే వైసీపీ వాళ్ళు గుంటూరు, తిరుపతి, విజయవాడ పార్టీ ఆఫీసులపై దాడులు చేశారు. అలాటే పట్టాభి ఇంటిపైన కూడా దాడిచేశారు.
ఈ విధంగా మాట్లాడేది ఒక్క పట్టాభే కాదు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వాళ్ళు కూడా వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా పదే పదే జగన్ పై బురద చల్లుతున్నారు. అవినీతి ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విషయం తమ్ముళ్ళకు అర్ధమైపోయింది.
జనాల్లో జగన్ను పలుచన చేయాలంటే టీడీపీ నేతల వల్ల కావటం లేదు. జగన్ను డైరెక్టు ఎటాక్ చేస్తు తమ ఆఫీసులపైన దాడులు జరిగేట్లుగా రెచ్చగొడుతున్నారు. నిజానికి టీడీపీ జగన్ పై నోరుపారసుకోవటం ఎంత తప్పో వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయటం అంతే తప్పు. మొత్తానికి టీడీపీ నేతల ఉచ్చులో వైసీపీ నేతలు పడినట్లే అనిపిస్తోంది. అంటే టీడీపీ నేతల వ్యూహం సక్సెస్ అయినట్లే అర్ధమవుతోంది. మరి ఇలాంటి ట్రిక్స్ తో తమ్ముళ్ళు ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలి.
అయితే, వీరిని తప్పు పట్టాలంటే వైసీపీ నేతల్లో బూతులకు కేరాఫ్ అయిన కొడాలి నాని, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని జగన్ అదుపు చేయాలి. ముందు అధికార పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానేయాలి. లేకపోతే ఇరు పార్టీలు జనాల్లో పలుచన అయిపోతారు. గతంలో ఇలా బూతుల దాడి ఉండేది కాదు, ఈ మధ్య మరీ ఎక్కువైంది.