Begin typing your search above and press return to search.
బాబు సమక్షంలోనే తమ్ముళ్లు ఇలా చేయడం ఏంటో?!
By: Tupaki Desk | 15 April 2018 6:37 AM GMTదాదాపుగా గత రెండు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గురించిన పరిచయ వాక్యాలు ఎలా ఉంటాయో..ఆ పార్టీని దగ్గరగా గమనించిన వారికి తెలిసిందే. `తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అధినాయకుడు చంద్రబాబు అంటే భయం, భక్తి. ఆయన ముందు ఉంటే వాళ్ల అటెన్షన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడి ముందు విద్యార్థుల వలే ఉంటుంది` అంటూ చెప్తుంటారు. అయితే సాక్షాత్తుగా పార్టీ నేతలు ఇంకా చెప్పాలంటే ఎంపీ - ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు సాక్షాత్తు చంద్రబాబు ముందే చర్యలకు నెటిజన్లు పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం రాజధాని పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో త్వరలోనే టీడీపీ కూడా చక్రం తిప్పే రోజులు రానున్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, నాలుగు సంవత్సరాలు ఎదురుచూస్తే పేద రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. నరేంద్రమోడీ కన్నా తాను సీనియర్‌నని, 1995లోనే తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైతే, 2002లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయినా సంగతిని గుర్తు చేశారు.
అయితే ఇలా బాబు మార్క్ స్పీచ్ కొనసాగుతుంటే మరోవైపు తెలుగుతమ్ముళ్లు హ్యాపీగా నిద్రలో జోగడం కనిపించింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సీటు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్న ఎంపీ కేశినేని నాని - ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశాంతంగా నిద్రను ఆస్వాదిస్తుండటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత గద్దె రామ్మోహన్ సైతం కూల్ గా కునికిపాట్లతో బాబు ప్రసంగాన్ని గాలికి వదిలేసిన తీరును పలువురు నెటిజన్లు బాహాటంగానే ఎత్తిచూపుతున్నారు. ఇలా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత సమక్షంలోనే టీడీపీ నేతల కునికిపాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా టీడీపీ నేతలు చిన్నబుచ్చుకునే స్థాయిలో కామెంట్లు వదిలేలా చేస్తోంది.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి