Begin typing your search above and press return to search.
టీడీపీ నేతలు నంద్యాలకే అతుక్కుపోయారే!
By: Tupaki Desk | 22 Aug 2017 4:27 AM GMT`దేశంలో సీనియర్ నాయకుడిని నేనే - ఎన్నో ఎన్నికలను చూశాను` అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు.. నంద్యాల ఉప ఎన్నిక చుక్కలు చూపెడుతోందన్న వాదన వినిపిస్తోంది. `నాకు అసలు భయమే లేదు.. ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొంటాన`ని బీరాలు పలికే ఆయనలో ఓటమి భయం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఒకే ఒక్క ఉప ఎన్నికను సమర్థంగా ఎదుర్కోలేక ప్రలోభాలకు తెగబడుతున్నారన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఉప ఎన్నిక మొదలైన నాటి నుంచి నిబంధనలు తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరు చేసేందుకూ వెనుకాడటం లేదట. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత.. నాయకులెవరూ ఉండొద్దని ఆదేశాలిచ్చినా.. ఓటమి భయంతో ఉన్న నేతలు ఇప్పుడు వీటిని అస్సలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
మంత్రులు - ఎమ్మెల్యేలు - ఇతర కీలక నాయకులు.. ఇంతమంది ప్రచారం చేసినా.. ఇంకా టీడీపీ నేతల్లో భయాందోళనలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయట. ఇప్పటికే ఓటమి ఆందోళనలో ఉన్న నేతలు నంద్యాలను విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్నారట. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీలో ఓటమి భయం తారస్థాయికి చేరిందన్న వాదన వినిపిస్తోంది. ఓటర్ల చేతిలో డబ్బులు పెట్టి తమకే ఓటేయాలంటూ దేవుడి బొమ్మ మీద ప్రమాణం చేయిస్తున్నా.. వారి భవిష్యత్తు కళ్లకు కనిపిస్తుండటంతో టీడీపీ నేతలు నంద్యాలను విడిచి కదిలేది లేదంటున్నారట. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగిసినా ఏపీ మంత్రులు - టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నంద్యాలోనే తిష్టవేశారని సమాచారం.
కర్నూలు జిల్లాను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశించినా నంద్యాలలోనే పాగా వేసిన టీడీపీ నేతలు - మంత్రులు - కార్యకర్తలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు - కృష్ణా సహా ఇతర జిల్లాల నుంచి టీడీపీ నేతలు నంద్యాలకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో నంద్యాల హోటళ్లు - లాడ్జీలు టీడీపీ నేతలతో నిండిపోయాయట. ఇతర జిల్లాల మంత్రులు కూడా నంద్యాలలోనే మంత్రాంగం నడుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరగదంటూ టీడీపీ నేతలు ఓటర్లను భయాందోళలనకు గురిచేస్తూనే ఉన్నారట. దీనిని బట్టి నేతలు ఎంతలా భయపడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు!!