Begin typing your search above and press return to search.
చూస్తుంటే లోకేష్ మంత్రి అయ్యేలా ఉన్నాడే
By: Tupaki Desk | 5 Jun 2016 10:20 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు మంత్రి పదవి చేపట్టేందుకు రూట్ క్లియరయిందా? లోకేష్ చేరికపై బాబు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నవనిర్మాణ దీక్ష నేపథ్యంలో చంద్రబాబు వివిధ చానెళ్లు - పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా లోకేష్ రాజకీయ భవితవ్యం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఇంకా సమయం ఉంది కదా? మీకు తెలియకుండా చేయనుకదా? అంటూ లోకేష్ ను మంత్రిగా చూడటంలో తప్పేమిటి? అతను పార్టీ కోసం కష్టపడుతున్నాడు. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించడంతో వచ్చే మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు చోటు ఖాయమని స్పష్టమయిపోయింది.
లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మంత్రులు గంటా శ్రీనివాసరావు - పత్తిపాటి పుల్లారావు - పల్లె రఘునాధరెడ్డి - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ - ఎంపి గరికపాటి మోహన్ రావుతో పాటు పార్టీలోని మరికొందరు సీనియర్లు కూడా చాలాకాలం నుంచీ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే నేరుగానే మాట్లాడారు. లోకేష్ కు మరిన్ని బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పరోక్షంగా మంత్రి పదవి ఇవ్వాలని బాబు సమక్షంలోనే సూచించారు. గత రెండేళ్ల నుంచి లోకేష్ ఇటు పార్టీ కార్యకలాపాల్లోనూ, అటు ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
ఆ సందర్భంగా జిల్లా నాయకులు - వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నాయకులను పిలిపించి, ముందు వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేరినప్పటికీ, మీ ప్రాధాన్యం ఎట్టి పరిస్థితిలోనూ తగ్గదని భరోసా ఇస్తున్నారు. ఆ తర్వాత వారిని బాబు వద్దకు పంపిస్తున్నారు. అంటే ముందుగా రంగం సిద్ధం చేసి, తర్వాత చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారన్నమాట. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా లోకేష్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల మంత్రులకు పంపిస్తున్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి వివిధ కాంట్రాక్టులు - ఇతర వ్యవహారాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. టీజీ వెంకటేష్ కు రాజ్యసభ ఇవ్వడంలో లోకేష్ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సమీకరణాలన్నీ జతకలిస్తే లోకేష్ మంత్రి అవడం ఖాయమంటున్నారు.