Begin typing your search above and press return to search.
విశాఖపై.. తెలుగుదేశం పార్టీలో చీలిక మొదలైందా?
By: Tupaki Desk | 25 Dec 2019 5:47 AM GMTవిశాఖను పాలనాపరమైన రాజధానిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కొంతమంది, వ్యతిరేకిస్తూ మరి కొంతమంది.. ఇలా తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన చీలిక కనిపిస్తూ ఉంది. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే.. విశాఖ తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది సమావేశమై ప్రభుత్వ ప్రకటనను స్వాగతించాలని డిసైడ్ అయ్యారట.
ఒకవైపు చంద్రబాబు నాయుడు అమరావతి ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతి నుంచినే అంతా జరగాలి అనేది అక్కడి వారి వాదన. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి అనుగుణంగా వాదిస్తుంటారు. అయితే అమరావతి ప్రాంత వాసుల తీరులో అత్యాశ కనిపిస్తూ ఉంది. రాయలసీమ ఏమైనా అయిపోవచ్చు, ఉత్తరాంధ్రనూ పట్టించుకోనక్కర్లేదు.. అమరావతి మాత్రమే కేంద్రంగా ఉండాలని అంటూ వారు వాదిస్తూ ఉన్నారు.
ఈ ప్రాంతీయ వీరాభిమానానికి చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఆ ఉద్యమానికి తెలుగుదేశం అధినేతతో పాటు, ఆయన అనుకూల మీడియా కూడా వత్తాసు పలుకుతూ ఉంది. అదేమంటే రైతులు భూములు ఇచ్చారని అంటున్నారు. అయితే వారేమీ ధారాదత్తం చేయలేదు. ఒక వ్యాపారానికి వారు ముందుకు వచ్చారు. ఆ వ్యాపారం సరిగా సాగడం లేదు. ఇప్పుడు భూములు యథాతథంగా తీసుకోవడంలో వారికి నష్టం ఏమీ లేకపోవచ్చు కూడా.
ఆ సంగతలా ఉంటే.. విశాఖను పాలన పరమైన రాజధానిగా జగన్ నిర్ణయించడాన్ని అక్కడి తెలుగుదేశం నేతలు కొందరు స్వాగతిస్తూ తీర్మానం కూడా చేయడానికి రెడీ అయ్యారని సమాచారం. ఇప్పటికే ఒక సమావేశం కూడా జరిగిందని తెలుస్తోంది. తదుపరి సమావేశంలో వారు తీర్మానాన్ని ప్రవేశ పెట్టి దాన్ని ఆమోదించనున్నారట. అలా తీర్మానాన్ని ఆమోదించే నేతల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం.
ఇలాంటి నేపథ్యంలో..అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చినట్టే. చంద్రబాబు నాయుడు స్వయంగా మూడు రాజధానుల తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో విశాఖలో తీర్మానం ఆమోదం పొందితే.. ఆ పార్టీ అధినేతగా ఆయన ఎలా స్పందిస్తారో!