Begin typing your search above and press return to search.
తమ్ముళ్లకు ఆశ్చర్యంగా మారిన జగన్ స్పీడ్!
By: Tupaki Desk | 4 Jun 2019 7:56 AM GMTవిషయాల మీద క్లారిటీ ఉన్నోళ్లకు నిర్ణయాలు తీసుకునే విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. తానేం చేయాలన్న దానిపై ఏళ్లకు ఏళ్లుగా ప్రణాళికలు రూపొందించుకున్న జగన్.. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనాపరమైన నిర్ణయాల విషయంలో పరుగులు పెట్టిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే జగన్ పాలన ఎలా ఉంటుందో అందరికి అర్థమయ్యేలా చేస్తున్నారు.
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన పాఠశాలల్ని పన్నెండు వరకూ వాయిదా వేశారు. తెలంగాణలో మాదిరే ఏపీలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన వెంటనే స్కూల్ సెలవుల మీద జగన్ నిర్ణయం తీసుకోవటం.. పన్నెండు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయించేశారు.
అంతేనా.. పెండింగ్ లో ఉన్న ఐఆర్ విషయంలోనూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇంతేనా.. ఆశ వర్కర్ల విషయంలోనూ ఆయన అంతే వేగంగా నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాలతో పాటు.. పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్నారు. అధికారులతో రివ్యూలను సైతం స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేయటంతో పాటు.. అనవసర చర్చకు ప్రాధాన్యత ఇవ్వకుండా పని మీదనే ఫోకస్ పెట్టేస్తున్నారు.
పలు పథకాల పేర్లను మార్చే విషయం మొదలుకొని పాలనా పరమైన నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తూనే కీలక స్థానాల్ని ఎవరికి కేటాయించాలన్న అంశం మీద ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా.. ఒకే సమయంలో 360 డిగ్రీస్ లో నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ తీరు తెలుగు తమ్ముళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన తొలి సిట్టింగ్ లోనే ఏపీకి కేటాయించిన భవనాల విషయం మీద నిర్ణయం తీసుకొని.. భవనాల్ని తిరిగి ఇచ్చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందన్న వైనాన్ని తన తీరుతో తేల్చేసిన జగన్ స్పీడ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ.. కార్యకర్తల్లోనూ చర్చగా మారింది. పాలనా పరంగా తమ అధినేతకున్న అనుభవం ముందు జగన్ తేలిపోతారని ఇప్పటివరకూ వారి అంచనాలకు భిన్నంగా జగన్ స్పీడ్ ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఆరంభంలోనే జగన్ స్పీడ్ ఇలా ఉంటే.. పాలనాపరమైన అంశాల మీద పట్టు వచ్చాక మరెంత వేగంగా దూసుకెళతారన్న చర్చ ఇప్పుడు ఎక్కువగా సాగుతుండటం గమనార్హం.