Begin typing your search above and press return to search.
ప్రశాంత్ దావా వేస్తే వాళ్లు కోట్లు కట్టాల్సిందేనా?
By: Tupaki Desk | 8 Aug 2017 5:30 PM GMTఅధినేతను సంతృప్తి పరచే విషయంలో నాయకులు హద్దులు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఇది సహజం. వ్యక్తిపూజకు పరాకాష్టగా ఉండే తెలుగుదేశం పార్టీలో కూడా ఈ పోకడ కాస్త ఎక్కువగానే ఉంటుంది. చంద్రబాబును ఇంప్రెస్ చేయడంలో.. లాజిక్ లేకుండా మాట్లాడేసే నాయకులు మనకు నిత్యం చాలా మందే కనిపిస్తుంటారు. పైగా ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులను చంద్రబాబు భర్తీ చేసిన తర్వాత.. తమకు ఉన్న హోదాలను అడ్డు పెట్టుకుని తరచూ ప్రెస్ మీట్ లు పెడుతూ.. మీడియాను పిలిపిస్తూ.. ఎడాపెడా మాట్లాడేసేవాళ్ల జాబితా కూడా పెరిగిపోయింది. అయితే పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే.. ఇలా ముందూ వెనుకా చూసుకోకుండా మాట్లాడేవాళ్ల వల్ల.. పార్టీకి గానీ.. సదరు నాయకులకు గానీ... న్యాయపరమైన చిక్కులు వస్తాయేమో అని కూడా భయపడుతున్నారు.
ఎందుకంటే.. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ ఎం. లింగారెడ్ది నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యల గురించి తన అమూల్యాభిప్రాయాన్ని వెల్లడించారు. తతిమ్మా నాయకులంతా జగన్ తిట్టిన తిట్లకు కౌంటర్ గా జగన్ ను కూడా తిట్టడం వరకు సరిపెట్టుకోగా, ఆయన మరో అడుగు ముందుకేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలంటూ ఓ ప్రకటన గుప్పించారు.
అయితే, ఆయనకు తెలిసి మాట్లాడారో, తెలియక మాట్లాడారో మనకు తెలియదు గానీ.. మరో మడత పేచీ కూడా పెట్టారు. ఇలాంటి కుట్ర కేసుల్లో.. తెర ముందు మాట్లాడిన వాళ్లు మాత్రమే కాకుండా, తెర వెనుక ఉండి, వారితో మాట్లాడించిన వారు కూడా శిక్షార్హులేనని ఆయన తేల్చారు. ఆ లెక్కన వైకాపాకు ప్రస్తుతం వ్యూహాల కన్సల్టెంట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా నేరస్తుడే అవుతాడట.
‘చంద్రబాబునాయుడు ను రోడ్డు మీద కాల్చినా తప్పులేదు’ అని జగన్ తన అభిప్రాయంగా చెప్పారే తప్ప.. ‘కాల్చాలి’ అనే మాట వాడలేదు. కానీ తెదేపా నాయకులే పదేపదే ‘కాల్చాలి.. రోడ్డుపై కాల్చాలి’ అంటూ దానికి ప్రచారం కల్పిస్తున్నారు. అదలా ఉంచితే.. పార్టీకి వ్యూహకర్త అయినందుకు జగన్ ప్రసంగాలకు ప్రశాంత్ కిషోర్ కూడా బాధ్యుడే అని మాట్లాడితే ఎలాగ? ఆయనేమీ జగన్ కు బాస్ కాదు కదా..? ఈ లెక్కన ప్రసంగాలు రాసే వారినందరినీ దోషులుగా గుర్తించాలంటే ఎలాగ? అనేది చాలా మందిలో కలుగుతున్న సందేహం. వారు గనుక సీరియస్ గా తీసుకుని.. సరిగ్గా కేసులు వేస్తే.. ఇలాంటి తలాతోకా లేని వ్యాఖ్యల వల్ల పరువునష్టం కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని పలువురు అనుకుంటున్నారు.