Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీల ఓటమికి ఆ మంత్రిని వాయించేస్తున్నారు
By: Tupaki Desk | 22 March 2017 1:13 PM GMTపట్టభద్రులు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీలో తీవ్ర చర్చోపచర్చలకు కారణంగా మారుతోంది. ఏకంగా టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో సైతం టీడీపీ అభ్యర్థులు ఓడిపోవడం పట్ల తమ్ముళ్లు షాక్ తింటున్నారు. ఈ క్రమంలో ఓటమికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అని చెప్తున్నారు. బాబు దగ్గర తను అన్న మాట నెగ్గించుకునే మంత్రిగా పేరున్న నెల్లూరుకు చెందిన నారాయణపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం, పరిస్థితులు బాగాలేకపోయినా దూకుడుగా వెళ్లి పరువు పోగొట్టుకునే పనులు చేస్తున్నారని ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే నిదర్శనమని చెప్తున్నారు.
నెల్లూరు- చిత్తూరు- ప్రకాశం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చిత్తుచిత్తుగా ఓటమి పాలవడం మంత్రి మెడకు చుట్టుకుంటోంది. మంత్రి నారాయణ అనుచరుడిగా పేరున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి టిక్కెట్ ఖరారు అయిన సమయంలోనే పార్టీకి చెందిన అనేకమంది నేతలు వ్యతిరేకించారు. ఆయనతో ఎవరికీ సఖ్యత లేదని చెప్పారు. అయినప్పటికీ నారాయణ పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవగా పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి గెలిచారు. అయితే ఈ ఓటమిని తాము ఎప్పుడో ఊహించేశామని టీడీపీ నేతలు చెప్తున్నారు. వేమిరెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతోనే టీడీపీ ఓడిపోయినట్లు అయిందని, ఆయనకు అసలు ఏ వర్గాల్లోనూ ఎలాంటి మంచి పేరు లేదని.. పార్టీ అధిష్టానంపై మంత్రి నారాయణ ఒత్తిడి తెచ్చి టిక్కెట్ ఇప్పించుకున్నందుకు తగిన పలితం దక్కిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాసుదేవనాయుడును నిలబెట్టడంపై సైతం తమ్ముళ్లు మండిపడడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరుకు ఇంచార్జీగా ఉన్న నారాయణ తనపై తాను చాలా భరోసా పెట్టుకోవడం, పార్టీ కూడా లైట్ తీసుకోవడంతో ఓటమి ఎదురైందని అంటున్నారు. పార్టీ రివ్యూ సమావేశంలో ఈ మేరకు హాట్ డిస్కషన్ జరగడం ఖాయమని చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/