Begin typing your search above and press return to search.
కౌంటింగ్ టెన్షన్: తెలుగుదేశం పార్టీకి కొత్త భయాలు పీక్స్!
By: Tupaki Desk | 22 May 2019 2:30 PM GMTమరి కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. సరిగ్గా చెప్పాలంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకు దేశ వ్యాప్తంగా కౌంటింగ్ మొదలుకానుంది. ఏపీకి సంబంధించింది ఈ కౌంటింగ్ మరింత ప్రత్యేకం. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి.. అటు కేంద్రంలో ప్రభుత్వం ఎవరిది అనేదే కాదు.. రాష్ట్రంలో పగ్గాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై కూడా రేపు క్లారిటీ వస్తుంది కాబట్టి.. సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రేపు వెల్లడయ్యే ఫలితాలపై అనేక రెట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.
ఇక ఈ ఫలితాల విషయంలో పైకి అయితే రాజకీయ పార్టీలు తమ తమ విజయాల పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజయం అని అంటోంది. తాము విజయం సాధించడం ఖాయమని బల్లగుద్దుతూ ఉన్నారు ఆయా పార్టీల నేతలు.
రేపు కౌంటింగ్ నేపథ్యంలో.. ఈ రోజు కూడా ఏపీలో రెండు ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు విజయం పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమంది నేతలు వచ్చి తాము గెలవబోతున్నట్టుగా ప్రకటించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంతమంది నేతలు ముందుకు వచ్చి విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇలా నేతల మాటలు పైకైతే ఒకేలా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అసలు కథ ఎలా ఉందంటే.. దాని విషయంలో ప్రజలను అడిగితే చెబుతారు. పోలింగ్ కు ముందు నుంచినే ఏపీలో విజయావకశాల గురించి ప్రజల్లో చర్చ సాగుతూ ఉంది. ఆ విషయంలో మెజారిటీ ప్రజలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయం ఏమిటో రేపు తెలుస్తుంది.
ఆ సంగతలా ఉంటే.. ఏపీలో బెట్టింగ్ ట్రెండ్ కూడా పతాక స్థాయిలో సాగుతూ ఉంది. వేల కోట్ల రూపాయలు బెట్టింగులు పడ్డాయి. రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని ఎవరు సొంతం చేసుకుంటారనే అంశంతో మొదలు.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? ఎంపీలుగా ఎవరు గెలుస్తారు? అనే అంశాలపై బ్రహ్మాండమైన స్థాయిలో సాగుతున్నాయి బెట్టింగులు.
కొందరు ప్రముఖుల నియోజకవర్గాల విషయంలో రాష్ట్రమంతా బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ తో బెట్టింగ్ లు మరింతగా పెరిగాయి. లగడపాటి సర్వే మినహా మిగతా సర్వేల్లో ఏవీ అంతా పేరున్న సంస్థలు తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందని చెప్పలేదు. అయితే లగడపాటి రాజగోపాల్ సర్వేనే తమను కాపాడుతుందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెబుతూ ఉంది.
అయితే బెట్టింగ్ రాయుళ్లను మాత్రం లగడపాటి రాజగోపాల్ సర్వే ఈ సారి ప్రభావితం చేయలేదని ట్రెండ్స్ చెబుతూ ఉన్నాయి. లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ విడుదల అయిన తర్వాత కూడా బెట్టింగ్ రాయుళ్ల హాట్ ఫేవెరెట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని తెలుస్తోంది. ఇదే తెలుగుదేశం పార్టీని బాగా భయపెడుతూ ఉన్నట్టుగా భోగట్టా.
జనాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీదే బెట్టింగులు కట్టడానికి ఇష్టపడుతూ ఉండటం, వైఎస్సార్సీపీనే నెగ్గుతుందని భారీగా బెట్టింగులు పడుతూ ఉండటంతో.. తెలుగుదేశం పార్టీ నేతల్లో గందరగోళం మొదలైందని సమాచారం.
ఈ నేపథ్యంలో కొందరు కార్యకర్తల మధ్యకు రావడానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదట. బెట్టింగ్ ట్రెండులే ఎవరు గెలుస్తారనే అంశంపై పూర్తి స్పష్టతను ఇస్తున్నాయన్న విశ్లేషణల నేపథ్యంలో.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం నేత, తెగ హడావుడి చేసే ఆయన కూడా కార్యకర్తలకు కూడా మొహం చాటేస్తూ ఉన్నారని టాక్!