Begin typing your search above and press return to search.
నంద్యాల ఫలితంపై కాకినాడ తమ్ముళ్లలో కలవరం
By: Tupaki Desk | 25 Aug 2017 4:21 PM GMTకాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు చిత్రమైన సమస్య ఎదురవుతోందని చర్చ జరుగుతోంది. కాకినాడలో గెలుపు తేలికే అని ముందుగా అనుకున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఎదురవుతుండడంతో తెదేపా నేతల్లో కలవరం ఇప్పటికే మొదలైంది. దీనికి తోడుగా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో తెదేపా నేతలు ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. నగర పాలక సంస్థ మేయర్ పదవిని తొలిసారిగా కైవసం చేసుకుని సత్తా చాటాలని చూస్తున్న తెదేపా నేతలు నంద్యాలలో గనుక తెదేపా ఓటమి పాలయితే ఇక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 28వ తేదీన నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ మరుసటి రోజే 29వ తేదీన కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నంద్యాల పోలింగ్ ముగిసే వరకూ నంద్యాలలో గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేసిన తెదేపా నేతలు పోలింగ్ సరళిపై ఖంగుతిన్నారు. నంద్యాల పోలింగ్ సరళిని గమనించిన తెదేపా అధిష్టానం అక్కడ గెలుపు అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు వస్తున్న సమాచారంతో ఆందోళనకు గురవుతోంది. నంద్యాలలో తెదేపా, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. దీనిపై ఆయా మార్గాల్లో నివేదికలు రప్పించుకున్న తెదేపా నాయకత్వం నంద్యాలలో గెలుపు అంత సులభం కాదనే అభిప్రాయానికి వస్తోందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలపైనా తెదేపా ఆందోళనకు గురవుతోందని అంటున్నారు.
కాకినాడలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి తెదేపా అనేక ఇబ్బందులతో సతమతమవుతోంది. మిత్రపక్షం భాజపాతో ఎన్నికల సర్దుబాటు సజావుగా సాగకపోవడంతో పలు వార్డుల్లో రెబల్స్ బెడద వచ్చింది. తెదేపా టిక్కెట్లు ఆశించి విఫలమైన పలువురు ఆయా డివిజన్లలో ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగడం అధికార పార్టీ ఓట్లకే గండి పడుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులపై ప్రజల్లోనే కాకుండా తెదేపా శ్రేణుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుండడం కూడా సమస్యగా మారింది. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున నాయకులను కాకినాడకు రప్పించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులతో కలిసి ముఖ్య నేతలు ప్రచారానికి హాజరవుతుండడంతో పాటు ఆయా డివిజన్లలో పరిస్థితులను ఆరా తీస్తూ సర్దుబాట్లకు ప్రయత్నిస్తున్నారు. నగర పాలక సంస్థను కైవసం చేసుకుని తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే నంద్యాల పోలింగ్ ముగిసిన తరువాత పరిస్థితులు తెదేపాకు ప్రతికూలంగా ఉండడం, కాకినాడలో కూడా తెదేపా ప్రయత్నాలు సజావుగా ముందుకు వెళ్ళకపోవడం నేతలను కంగారు పెడుతోంది.
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో ఈ విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. కాకినాడలోని ఓ పంక్షన్ హాల్లో బూత్ కమిటీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం, స్థానిక నేతలు ప్రత్యేకంగా సమావేశమై పోలింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అయితే నంద్యాలలో తెదేపా విజయం సాధిస్తే కాకినాడలోనూ మరింత అనుకూల పరిస్థితులు వస్తాయని, ఒక వేళ నంద్యాల ఫలితం ప్రతికూలమైతే ఆ ప్రభావం కాకినాడ నగర పాలక సంస్థ పైనా పడుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లు సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అతి విశ్వాసంతో ముందుకు పోకుండా ఆయా డివిజన్లలో ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలించి తెదేపా అనుకూల ఓటర్లు ఎవరు? ప్రతికూల ఓటర్లు ఎవరు? అనేది అంచనాకు రావాలని, తటస్థంగా ఉండే ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి? వారిని తెదేపాకు ఎలా అనుకూలంగా మలచుకోవాలి? అనే అంశాలపై సలహాలు ఇచ్చారని సమాచారం. నంద్యాల ఫలితం తెదేపాకు ప్రతికూలంగా వచ్చినా డీలా పడకుండా కాకినాడలో పోరాట దృక్ఫథంతో ముందుకు పోవాలని పార్టీ ముఖ్యులు బూత్ కమిటీల వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఆయా డివిజన్లలో కులాల వారీగా ఓట్లను విభజించి వారిని పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు, అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను బూత్ కమిటీ ప్రతినిధులకు వివరించారని సమాచారం.