Begin typing your search above and press return to search.

ఈ ఖ‌ర్చు ఏ ఖాతాలో.. త‌మ్ముళ్ల‌కు తంటా...!

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:12 AM GMT
ఈ ఖ‌ర్చు ఏ ఖాతాలో.. త‌మ్ముళ్ల‌కు తంటా...!
X
టీడీపీలో స్థానిక నాయ‌క‌త్వానికి పెద్ద తంటానే వ‌చ్చింది. పార్టీ అధినేత సూచ‌న‌లు.. ఆయ‌న ఆదేశాల‌ను బ‌ట్టి.. జ‌న‌వ‌రి 27 నుంచి ప్రారంభం అయ్యే.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల్సి ఉంటుంది. దీనిని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. పైకి ఆయ‌న చెప్ప‌డం లేదు కానీ, అంత‌ర్గ‌త స‌మావేశాల్లో మాత్రం.. చంద్ర‌బాబు త‌న కుమారుడిని హైలెట్ చేయాల‌ని ఆదేశాలు జారి చేస్తున్నారు.

పాద‌యాత్ర‌లో పాల్గొన‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. చాలా జిల్లాల నాయ‌కుల‌కు చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అయితే.. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా జిల్లాల యాత్ర‌కు రెడీ అవుతున్నారు. వ‌చ్చే నాలుగు మాసాలు కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు జిల్లాల యాత్ర‌ను చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో దీని బాధ్య‌త‌ల‌ను కూడా త‌మ్ముళ్లే భుజానికి ఎత్తుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా అటు.. చంద్ర‌బాబు, ఇటు లోకేష్‌ల ఆగ్ర‌హానికి గురికావ‌డం త‌ప్ప‌ద‌నే చ‌ర్చ సాగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు డ‌బ్బుతోనే ప‌ని. ఎందుకంటే.. వైసీపీ నేత‌ల‌ను బ‌లంగా ఎదు ర్కొనేందుకు డ‌బ్బును వెద‌జ‌ల్లాల్సిందే.. అనే కాన్సెప్టు ఇప్ప‌టికే తెర‌మీదికి వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యం లో చంద్ర‌బాబు, లోకేష్ ప‌ర్య‌ట‌న‌ల‌కు డ‌బ్బులు మొత్తం ఖ‌ర్చు చేస్తే.. త‌మ ప‌రిస్థితి ఏంటి? అనేది వారి ఆవేద‌న‌.

గ‌తంలో ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన ప‌నుల‌కే డ‌బ్బులు రాని ప‌రిస్థితి. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో క‌నీసం వ్యాపారాలు కూడా చేసుకునే ప‌రిస్థితి లేక చాలా మంది నేత‌లు విల‌విల్లాడిపోతున్నారు.

అయితే బాబు, లోకేష్ టూర్ బాగా స‌క్సెస్ చేయాల‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాల్లో కేంద్రాల్లోని నాయ‌కులు.. జిల్లా నాయ‌కులు ఖ‌ర్చును భ‌రించాలి. సో... దీనిని త‌ప్పించుకునేందుకు అవ‌కాశం లేదు. పైగా కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకురావాలి. పాద‌యాత్ర‌ను హిట్ చేయాలి. ఈలోగా వారికి భోజ‌నాలు.. వ‌స‌తి.. ఇలా అనేక విష‌యాల్లోనాయ‌కులు చొర‌వ చూపాలి. గెలిచిన స్థానాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఓడిన చోట‌.. లేదా.. బ‌లంగా లేని చోట కూడా డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తే..త మ ప‌రిస్థితి ఏంట‌ని త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.