Begin typing your search above and press return to search.
మనకూ ఒక మీడియా ఉంటే ఎంతబాగుండు?
By: Tupaki Desk | 4 March 2016 5:12 AM GMTగత మూడు రోజులుగా జగన్ మీడియా సంస్థలో హోరెత్తుతున్న తమ్ముళ్ల భూదందా కథనాలు.. ఏపీ అధికారపక్షం నేతల్లో కలకలం రేపుతున్నాయి. భారీ స్థాయిలో వస్తున్న కథనాలతో వారికి ఊపిరి ఆడటం లేదు. సొంత మీడియా సంస్థ ఉంటే ప్రయోజనం ఏమిటో వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జగన్ మీడియా సంస్థ ఆరోపించిన ఆరోపణలకు బిత్తరపోతున్న తమ్ముళ్ల వేదన అంతా ఇంతా కాదు.
తమ కుటుంబ సభ్యులో.. బంధువులో ఏదో కొద్ది భూమి కొన్నా దాన్ని తమ ఖాతాలోకి వేసేయటం.. అదేమంటే బినామీ ట్యాగ్ కట్టేయటంపై వారు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ మీడియా పేర్కొన్న విధంగా తాము భారీగా భూమిని దోచుకున్నా ఆ కథ వేరేగా ఉండేదని.. కానీ.. అందుకు భిన్నంగా కథనాలు అల్లేయటం ఏమిటంటూ వారు మండిపడుతున్నారు.
తమకు ఒక మీడియా సంస్థ ఉండి ఉంటే.. జగన్ మీడియా ప్రచారాన్ని అడ్డుకట్ట వేయటంతో పాటు.. ఎదురుదాడి చేసేందుకు వీలుండేదన్న ఆవేదనను వారు వ్యక్తం చేయటం గమనార్హం. జగన్ వాదనను వినిపించేందుకు సొంత మీడియా ఉంటే.. తమకు అలాంటిదేదీ లేదన్న లోటు తాజాగా తెలుస్తుందని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్ హయాంలో ‘‘పెద్దలా.. గద్దలా’’ అంటూ ఈనాడు ప్రచురించిన భారీ భూకుంభకోణం.. ‘‘సాక్షి’ పుట్టుకకు కారణంగా చెబుతుంటారు. తమను దునుమాడే వర్గాల్ని టార్గెట్ చేయటం కోసం వైఎస్ అండ్ కో తమదైన మీడియా సంస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో. తాజా భూదురాక్రమణ కథనం మరో మీడియా సంస్థ ఏర్పడేందుకు కారణం అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.